హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : తాను ధరించిన వాచ్ ధర రూ.10-40 వేలు మాత్రమే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తన వాచ్ ధరపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను రూ.కోటి ఖరీదైన రోలెక్స్ వాచ్ ధరించి అసెంబ్లీకి వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ధరించిన వాచ్ మైకేల్ కోర్సు బ్రాండ్‌కు చెందినది అని స్పష్టం చేశారు. దీని ధర ఆన్లైన్లో రూ.10-40 వేలుగా చూయిస్తుందని తెలిపారు.