పర్వతగిరి, నవంబర్ 27: పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగాయని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని పార్టీ కార్యకర్తలు, మహిళలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. ఇంటింటా ప్రచారంలో కారు గుర్తుకు ఓటు వేసి తనను మూడోసారి గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలకు మరింత లబ్ధి చేకూర్చేలా మ్యానిఫెస్టో రూపొందించారని, దాని వల్ల రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నదన్నారు.
ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి అవగాన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కనిపించ డంలేదా? అని ప్రశ్నించారు. తాము చేసిన పనులను కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేస్తామనడం వారికే చెల్లిందన్నారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని చెప్పారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలన్న రేవంత్‌రెడ్డిని, వారి అభ్యర్థులను తెలంగాణ నుంచి తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు రక్ష అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా చివరికి నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.
కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ మాడుగుల రాజు, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, మాజీ ఎంపీపీ రంగు రజిత, పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, ఉపసర్పంచ్ జనార్ధన్‌గౌడ్, సంపత్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరూరిని సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ రాజు నేతృత్వంలో గజమాలతో ఘనంగా సత్కరించారు.