ఎంజీఎంహెచ్‌లో విరిగిపడిన విద్యుత్ స్తంభం
మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎంజీఎంహెచ్)లో గురువారం తెల్లవారుజామున ఇనుప విద్యుత్ స్తంభం విరిగిపడింది.
- తెల్లవారుజామున ప్రమాదంతో తప్పిన ప్రాణాపాయం
- ఓపీతో పాటు పలు విభాగాలకు విద్యుత్ అంతరాయం
- సేవలందక ఇబ్బందులు పడిన రోగులు
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 30 : మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎంజీఎంహెచ్)లో గురువారం తెల్లవారుజామున ఇనుప విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఆస్పత్రి పార్కింగ్ ఏరియాలో ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, అక్క డ ఏవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ నేపథ్యంలో ఔట్ పేషెంట్(ఓపీ)తో పాటు ఫిజియోథెరపి, పారా మెడికల్ తదితర విభాగాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
విష యం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ స్తంభానికి అనుసంధానంగా ఉన్న ఇతర లైన్లకు సరఫరా నిలిపివేశారు. దీనివల్ల ఓపీ రిజిస్ట్రేషన్ విభాగంలో కంప్యూటర్లు పని చేయకపోవడంతో రోగులకు చేతిరాత ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించారు. లైట్లు, ఫ్యాన్లు లేక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఫిజియోథెరపీ, పారామెడికల్ విభాగాల్లో రోగులకు సేవలందలేదు.
ఈ స్తంభా చాలా కాలంగా ఒక వైపుకు ఒరిగిపోయినట్లుగా ఉందని, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, జనసంచారమున్న సమయంలో జరిగితే ప్రాణాపాయం కలిగేదని సిబ్బంది చెబుతున్నారు. స్తంభం తుప్పు పట్టడం, గాలి బలంగా వీచడంతోనే విరిగిపడినట్లు విద్యుత్ అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మరమ్మతు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇప్పటికైనా ఆస్పత్రి ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను తొలగించాలని వైద్యులు, రోగులు, అటెండెంట్లు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

