హనుమకొండ చౌరస్తా, జూన్ 3 : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా పరకాలకు చెందిన బొచ్చు చందర్‌ను ఆ పార్టీ నియమించింది. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బొచ్చు చందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ సీనియర్ నాయకులు దాడబోయిన మీరస్వామికి బొచ్చు చందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పాలకుర్తి శ్రీనివాస్, నిట్టె బాలరాజు, చిన్నాల గోపాల్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Northeast Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. అస్సాం, సిక్కిం సీఎంలతో మాట్లాడిన ప్రధాని