హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : మీడియా డెస్లలో పనిచేస్తున్న ప్రతి సబ్ ఎడిటర్‌కు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట, హైదరాబాద్ ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేయాలని డీజేఎఫ్టీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్యోతిబసు, మస్తాన్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సర్యులేషన్తో సంబంధం లేకుండా ప్రతి జిల్లా డెస్కు 5 కార్డుల చొప్పున ఇవ్వాలని, హైదరాబాద్ సిటీ డెస్కు 18, ఒక్కో సెంట్రల్ డెస్కు 20, టీవీ చానళ్లకు ప్రస్తుతం ఉన్న 8 కార్డుల సంఖ్యను 15కు పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయాలని, కార్టూనిస్టుల కాలం యాడ్ చేసి వారికీ కార్డులివ్వాలని కోరారు. డెస్క్ జర్నలిస్టుల ధర్నాలకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ), టీయూడబ్ల్యూజే 143, టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే తదితర జర్నలిస్టు సంఘాలు కూడా మద్దతు తెలిపినట్టు పేర్కొన్నారు. సోమవారం జరిగే ధర్నాల్లో ప్రతి డెస్ జర్నలిస్టు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
రఘునాథపాలెం, ఫిబ్రవరి 22: జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రెడిటేషన్ కమిటీలు ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ)నాయకులు ఖ మ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నేత రాంనారాయణ మాట్లాడుతూ.. 44,709 అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని గతంలో మాట ఇచ్చారని గుర్తుచేశారు. కానీ 50శాతం కార్డులు కూడా రావనే గందరగోళం నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి స్పం దిస్తూ.. యూనియన్ల ప్రతిపాదన మేరకు అక్రెడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.