హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలో 4 పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నాలుగేండ్ల క్రితం మోదీ సర్కార్ రూ.146.50 కోట్లు మం జూరు చేసినప్పటికీ ఆ నిధులు విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి మంజూరు చేసిన రూ.4.22 కోట్లలో ఒక్క రూపాయి విడుదల చేయలేదు. భద్రాచలం దేవాలయ అభివృద్ధికి మంజూరు చేసిన రూ.41.38 కోట్లలో రూ.8.43 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో పర్యాటక పార్లమెంట్లో ఓ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ వివరాలు వెల్లడించారు.
వారసత్వ సంపద అభివృద్ధి పథకం కింద ములుగు జిల్లాలోని రామప్పలోని రుద్రేశ్వర ఆలయానికి 2022-23లో రూ.62 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. ఇప్పటివరకు రూ.32.73 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
2022-23లో తీర్థయాత్ర పథకం కింద భద్రాచలం దేవాలయ అభివృద్ధికి మంజూరు చేసిన రూ. 41.38 కోట్లలో రూ.8.43 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
అలంపూర్‌లోని జోగుళాంబ దేవీ ఆలయాన్ని 38.90 కోట్లతో అభివృద్ధి చేస్తామని 2020-21లో ప్రకటించిన మోదీ సర్కార్ రూ. 33.07 కోట్లు మాత్రమే ఇచ్చింది.
హైదరాబాద్ బల్కంపేటలోని రేణు కా ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధి కోసం 2024-25లో రూ.4.22 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు ఒక్క రూ పాయి కూడా విడుదల చేయ కపోగా, పనులు కొనసాగుతున్నాయని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పడం గమనార్హం.