అభివృద్ధికి కేరాఫ్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ చేసి నిధుల వరద పారించారు. దీంతో నల్ల నేల రూపురేఖలు మారిపోయాయి. కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి పట్టణం, జిల్లా కేంద్రం స్థాయికి ఎదిగింది.
- నియోజకవర్గానికి నిధుల వరద
- మారిన నల్లనేల రూపురేఖలు
- కలెక్టరేట్, మెడికల్ కళాశాల,జిల్లా పోలీస్ కార్యాలయాలతో కొత్త శోభ
- కుగ్రామం నుంచి జిల్లా కేంద్రం స్థాయికి..
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ చేసి నిధుల వరద పారించారు. దీంతో నల్ల నేల రూపురేఖలు మారిపోయాయి. కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి పట్టణం, జిల్లా కేంద్రం స్థాయికి ఎదిగింది. సమీకృత కలెక్టర్, మెడికల్ కళాశాల, జిల్లా పోలీస్ కార్యాలయంతో జయశంకర్ జిల్లా కొత్త శోభ సంతరించుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి, అనంతరం ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు.
కుగ్రామం నుంచి జిల్లా స్థాయికి..
ప్రస్తుత కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి మన్సిపాలిటీగా, జిల్లా కేంద్రంగా ఎదిగింది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గడిచిన ఐదేళ్లలో రూ.120 కోట్లతో పట్టణం లో మౌలిక సదుపాయాలు కల్పించి రూపురేఖలు మా ర్చారు. భూపాలపల్లి నుంచి కాశీంపల్లికి డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, భూపాలపల్లిలో డబుల్‌రోడ్డు, సెం ట్రల్ లైటింగ్, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, సింగరేణి కార్మికులకు 994 డబుల్ బెడ్ రూం క్వార్టర్లు, టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య మానేరుపై బ్రిడ్జి నిర్మా ణం, అన్ని మండలాల్లో డబుల్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మా ణం, భూపాలపల్లిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రేగొండలో డీబీఎం-38 కాలువ ద్వారా నీటి సరఫరా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కళ్ల ముందు సాక్ష్యాత్కరిస్తున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయతో చెరువులను పూడికతీత పనులు చేపట్టడంతో జలకళతో ఉట్టి పడుతున్నాయి. బైపాస్ రోడ్డుకు రూ.135 కోట్లు మంజూరు కాగా పనులు ప్రారంభమయ్యాయి.
మెడికల్ హబ్‌గా
ఎమ్మెల్యే గండ్ర కృషితో సీఎం కేసీఆర్ భూపాలపల్లికి మెడికల్ కళాశాల మంజూరు చేశారు .ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్నాయి. దానికి అనుబంధంగా 300 పడకల ఆస్పత్రికి రూ.100కోట్లు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి. అలాగే రూ.25లక్షలతో 50 పడకల ఆయుష్ దవాఖాన నిర్మాణంలో ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సిరికొండ మధుసూదనాచారి హయాంలో నిర్మించిన 100 పడకల ఆస్పత్రికి ఎమ్మెల్యే గండ్ర, సీఎం కేసీఆర్ కృషితో అన్ని వసతులు కల్పించి వైద్య పరికరాలు మసకూర్చి ఉపయోగంలోకి తెచ్చారు. దీంతో పాటు రూ.1.25 కోట్లతో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు.
కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం
ప్రజలకు సౌకర్యార్ధం సీఎం కేసీఆర్ భూపాలపల్లిలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించి అన్ని కార్యాలయాలు ఒకే చోట చేర్చి పాలనను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే రాజుల కోటను మరిపించేలా జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించి పోలీస్ కార్యాలయాలను ఒకే చోటికి చేర్చారు.
నియోకవర్గంలో అభివృద్ధి ఇలా..
- రూ.120 కోట్లతో భూపాలపల్లి పట్టణ అభివృద్ధి
- మెడికల్ కళాశాల, 300 పడకల ఆస్పత్రికి : రూ.100 కోట్లు
- సమీకృత కలెక్టరేట్ : రూ.69.62కోట్లు
- జిల్లా పోలీస్ కార్యాలయం : రూ.25 కోట్లు
- జిల్లా ప్రధాన వైద్యశాల : రూ.30కోట్లు
- ఆయుష్ హాస్పిటల్ : రూ.25 కోట్లు (నిర్మాణంలో ఉంది)
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్ : రూ.10కోట్లు (నిర్మాణంలో ఉంది)
- వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ : రూ.3కోట్లు
- మిషన్ భగీరథ : రూ.90కోట్లు
- భూపాలపల్లి నుంచి కాశీంపల్లి డబుల్ రోడ్- సెంట్రల్ లైటింగ్ : రూ.25కోట్లు
- సింగరేణి కార్మికులకు 994 డబుల్ బెడ్రూం క్వార్టర్లు (రామప్ప కాలనీ) : రూ.226కోట్లు
- బైపాస్ రోడ్డు : రూ.135 కోట్లు (సర్వే పనులు ప్రారంభం)
- భూపాలపల్లి మెయిన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ : రూ.70కోట్లు
- తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ : రూ.1.25 కోట్లు
- 817 మందికి 2,756 ఎకరాలకు పోడు పట్టాలు
- 20 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు(15 ఎకరాల స్థలం కేటాయింపు) : రూ.9.50 కోట్లు మంజూరు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

