కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వామి-భాగ్యలక్ష్మి, రవీందర్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, డాక్టర్ జగదీశ్వర్, చింతం సదానందం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
- శేష వాహనంపై భద్రకాళీ అమ్మవారి ఊరేగింపు
- పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
వరంగల్, ఏప్రిల్ 27 : భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వామి-భాగ్యలక్ష్మి, రవీందర్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, డాక్టర్ జగదీశ్వర్, చింతం సదానందం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముం దుగా ఆలయానికి విచ్చేసిన పెరిక సంఘం ప్రముఖులను ఆలయ ఈవో శేషుభారతి, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ మండపంలో వారికి అర్చకులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వడ్డే రవీందర్, సొమిశెట్టి శ్రీనివాస్, అల్లం నాగరాజు, పోతరాజు రాజేశ్వర్ రావు, బీర శంకర్ పాల్గొన్నారు. సాయంత్రం శేష వాహన సేవలో కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రామూర్తి, ఆర్ కుమారస్వామి, కే వేణుగోపాల్, ఎన్ రాజేందర్, కుమ్మరి కుల వృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా విద్యారణ్య జయంతి
విద్యారణ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. భద్రకాళి ఆర్చీ కూడలిలోని విద్యారణ్య విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేశారు. విద్యారణ్య వరంగల్ వాసి కావడం గర్వకారణమని అభివర్ణించారు. నాలుగు వేదాలకు బాష్యం రాసి, వేద విజ్ఞానాన్ని ప్రజల ముంగిట ఉంచిన గొప్ప మహానీయులని కొనియాడారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

