బచ్చన్నపేట నవంబర్ 14 : మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి, ప్రత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌కి రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ మాట్లాడుతూ భయంకరమైన వర్షాలు, గాలులు సంభవించి రైతులు పండించిన పంట తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వరి పత్తి మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునగడం నేలరాలిందన్నారు.
దీనికి తోడు ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడిసి ముద్దయిందన్నారు.
దీనివల్ల రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులను ఆదుకోవాలన్నారు. అంచనా వేసి ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలన్నారు. వరి పంటకు ఎకరాకు 40,000 చొప్పున పత్తి పంటకు 60 వేల రూపాయల చొప్పున మొక్కజొన్న పంటకు 30000 రూపాయలు చొప్పున రైతులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తేమశాతం అనే తేడా లేకుండా ప్రభుత్వం నేరుగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు ఎడబోయిన రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మినలాపురం ఎల్లయ్య, ఉప్పల గాలయ్య, బోదాసు సుధాకర్, సీనియర్ నాయకులు రావుల రవీందర్ రెడ్డి, బోడబట్ల బాలరాజు, రామగల్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.