కరీమాబాద్, జూలై 2 : జులై 6న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీమాబాదులో కురుమ కులస్తులు బోనాలను నిర్వహించనున్నట్లు బీరన్న దేవస్థాన కమిటీ అధ్యక్షులు కోరే కృష్ణ తెలిపారు. బుధవారం కరీమాబాద్‌లోని శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోరే కృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఏటా తొలి ఏకాదశి రోజున కురుమ కులస్తులు వీరన్న స్వామికి బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వందల ఏళ్లుగా వీరన్న స్వామికి కురుమలు బోనాలను చేస్తారన్నారు. తొలి ఏకాదశి రోజున ఉదయం జాతీయ జెండాను చేతబోని కమిటీ సభ్యులు పురవీధుల గుండా వచ్చి ఆలయంలోని చెట్టుకు కడతామన్నారు. అనంతరం సాయంకాలం వేల డప్పు చప్పులతో బీరన్నల విన్యాసాలతో బోనాలను ఆలయానికి తీసుకొస్తామన్నారు.
కరీమాబాదులోని బురుజు సెంటర్లో వీరన్నలు గొర్రె పిల్లను గావు పడతారన్నారు. ఈ గావును తిలకించేందుకు వందలాదిమంది జనం అక్కడకు వస్తారన్నారు. అనంతరం గావు పట్టిన గొర్రెపిల్ల దాటుతూ బోనాలు ఆలయానికి చేరుకుంటాయన్నారు. అనంతరం వీరన్న కళ్యాణం ఆలయంలో నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించి తిరిగి బోనాలు ఇళ్లకు చేరుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, మరుపళ్ళ రవి, ఉపాధ్యక్షులు కడారి కృష్ణ, ప్రధాన కార్యదర్శి మురికి రాజు, సహాయ కార్యదర్శి దయ్యాల సుధాకర్, కోశాధికారి నరిగ లక్ష్మణ్, ముఖ్య సలహాదారులు కంకల మల్లేశం, మండల కొమురెల్లి కోర కుమారస్వామి, బండారి రాజేశ్వర్, ఆర్గనైజర్స్ నంద నవీన్, గొట్టే సదానందం, గొట్టే మల్లేశం, కార్యవర్గ సభ్యులు కంచ తిరుపతి, వాసవి, శ్రీనివాస్, ఎమ్మే వేణు, కోరే రమేష్, అన్న శ్రీనివాస్, మురికి చిన్న రవి, కంచ మెట్టయ్య, కొమ్ము రాజు, కాటన్ సతీష్, బండారి మల్లేశం, కుల పెద్దలు, మండల రాజు, దయ్యాల పురుషోత్తం, కురుమ కులస్తులు పాల్గొన్నారు.