Badminton Sports | హనుమకొండ చౌరస్తా, జులై 24: మహబూబాబాద్ జిల్లా అమ్యోచూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోనెక్స్సన్రైజ్ 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి (అండర్-17 ఇయర్స్) బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు వరంగల్ ఆఫీసర్స్‌క్లబ్, కిట్స్ఇంజినీరింగ్ కాలేజీలో ఉత్సాహంగా జరిగాయి.
బాలికల సింగిల్స్‌లో 46, బాలికల డబుల్స్‌లో 13 ఎంట్రీలు, బాలుర సింగిల్స్‌లో 90 ఎంట్రీలు, బాలుర డబుల్స్‌లో 26 ఎంట్రిలు రావడం జరిగిందని, క్వాలిఫైయింగ్‌లో గెలుపొందిన క్రీడాకారులు 25 నుంచి జరిగే మెయిన్ డ్రా పోటీలకు అర్హత సాధిస్తారని అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి, డాక్టర్ కొమ్ము రాజేందర్ తెలిపారు.
క్వాలిఫైయింగ్ నుంచి బాలికల సింగిల్స్‌లో 2, డబుల్స్‌లో 6, బాలుర సింగిల్స్‌లో 12 మంది, డబుల్స్‌లో 4 టీంలకు అర్హత కల్పిస్తామన్నారు. మొత్తం 151 మ్యాచ్‌లు జరగగా.. ఇందులో బాలికల విభాగంలో లాస్య(ఆర్ఆర్) పంజాల హన్సిపై 15-10, 15-4తో గెలిచారు. బాలుర విభాగంలో సమ్రిత్ రెడ్డి హన్మంత్(మేడ్చల్) నందిక శివకుమార్‌పై 15-5, 15-2, చంద్రిక కొత్తపల్లి (హైదరాబాద్) మనస్విని(వరంగల్)పై 15-1, 15-7తో గెలుపొందారు.
గడ్డం అన్యూరెడ్డి(హైదరాబాద్) మర్యాల జననీపై 15-10, 15-11తో, ఆరాధ్య గురుకుంట(ఆర్ఆర్) శ్రేయా పవర్(ఆర్ఆర్)పై 15-12, 15-7 స్కోర్‌తో గెలిచారు. శ్రీధన్యదత్త(ఎస్ఆర్) తన్వీర్ రినా(ఆర్ఆర్)పై 15-10, 15-7పై, గురాల మన్యుత్ వాత్సవ్(వరంగల్) ఇనేష్రెడ్డి(ఆర్ఆర్)పై 15-7, 15-6తో గెలుపొందారు. రిహాన్(ఆర్ఆర్) నిరల్మన్పై 15-1, 15-1తో, పి.భార్గవ్(హైదరాబాద్) తేజత్(హైదరాబాద్)పై 15-11, 15-4తో, అబ్దుల్ రెహమాన్(ఆర్ఆర్), కృష్ణ ఎస్ఎం(ఆర్ఆర్)పై 11-15, 15-13, 15-11తో గెలుపొందారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ డాక్టర్ పి.రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌కుమార్, శ్యాంప్రసాద్, ఏటీబీటీ ప్రసాద్, రెఫరీ కె హనుమంతరావు, మ్యాచ్ కంట్రోల్ చంద్రశేఖర్, ఆర్.శ్యాంకుమార్, బేబి శైలజ పాల్గొన్నారు.
Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి 27రోజుల్లో రూ.4.17కోట్ల ఆదాయం..!
Ramavaram : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు : జీఎం షాలెం రాజు
KTR | తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ : ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు