నందికొండ, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. నందికొండ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ (MLA Nomula Bhagath Yada) అన్నారు. కౌన్సిలర్ అభ్యర్ధులు శ్రావణి, ఘణి, హర్ష, అన్నపూర్ణ, పెద్దయ్య, చంద్రమౌలి, షాహిదాబేగం, రమణ, శేఖర్ బాబు, సరోజ, రమేష్, మంజు శ్రీలతో కలసి ఆయన గురువారం నందికొండ మున్సిపాలిటీలోని పైలాన్, హిల్‌కాలనీలోని ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో, ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు.
రూ.42 కోట్లతో చేపట్టిన అమృత్, అంతర్గత సీసీ రోడ్డులు, కాలనీలో వీధి దీపాలు.. లాంటి అభివృద్ధి పనులు బీఆర్ఎస్ హయాంలో చేపట్టినవేనని, కానీ, వాటిని తామ చేసామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం విడ్డురుంగా ఉందని నోముల భగత్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ ఎన్నడూ అభివృద్ధికి నోచుకోలేదని, బీఆర్ఎస్ పాలనలోనే నాగార్జునసాగర్ అభివృద్ధికి జరిగిందని వెల్లడించిన ఆయన.. ప్రపంచ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు లభించిందని చెప్పారు.
ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడే బీఆర్ఎస్కే ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుందర్‌రెడ్డి, శివ, అర్జున్, రామచంద్రారెడ్డి, వర్షిత్, వెంకట్, మన్సూర్, రఫీ, కోడ విజయ్, మక్సూద్, గౌస్, వార్డు ఇన్ఛార్జ్లు, బీఆర్ఎస్ శ్రేణుల పాల్గొన్నారు.