YouTube | యూట్యూబ్‌లో మోస్ట్ అవైటెడ్ ఫీచర్ అందుబాటులోకి.. ఇకపై మీ భాషలోనే వీడియోస్
YouTube : యూట్యూబ్ యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆటో డబ్బింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ కొద్ది రోజుల నుంచి వస్తున్నా.. తాజాగా మరింత మెరుగ్గా, 27 భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
YouTube : యూట్యూబ్ యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆటో డబ్బింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ కొద్ది రోజుల నుంచి వస్తున్నా.. తాజాగా మరింత మెరుగ్గా, 27 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా ఇటు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు, అటు వ్యూయర్స్‌కు మేలు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీడియో కంటెంట్‌ను ఇకపై 27 భాషల్లో చూసే వీలుంది.
అలాగే అందరు కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ వాడుకుని, ఇతర భాషల వారికి కూడా దగ్గరవ్వొచ్చు. ఇంతకుముందు నుంచి ఈ ఫీచర్ ఉన్నా.. ఆ డబ్బింగ్లో సహజత్వం లేదని చాలా మంది ఫిర్యాదుచేశారు. కానీ, కొత్తగా అభివృద్ధి చేసిన టూల్ ద్వారా ఇది మరింత సహజంగా డబ్బింగ్ అందిస్తుంది. ఒరిజినల్లోని ఎమోషన్ చెడిపోకుండా, లిప్ సింకింగ్ సరిగ్గా ఉండేలా డబ్బింగ్ అందిస్తుంది. దీంతో ఇకపై వేరే భాషలోని వీడియో చూడాలంటే సబ్ టైటిల్స్ అవసరం లేదు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లోని కంటెంట్ డబ్బింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ఫీచర్ వాడుకోవాలంటే మీరు వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఆటో డబ్బింగ్ ఫీచర్ సెలక్ట్ చేసుకుని, కావాల్సిన భాషను ఎంచుకోవచ్చు.
అలాగే డబ్బింగ్ లాంగ్వేజ్ అక్కర్లేదు అనుకుంటే ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే వీడియోలు చూడొచ్చు. అయితే, డబ్బింగ్ సపోర్ట్ చేసే వీడియోలకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఏఐ వాయిస్ ద్వారా ఈ ఫీచర్ పని చేస్తుంది. అందరికంటే ఎక్కువగా ఈ ఫీచర్ ఉపయోగపడేది కంటెంట్ క్రియేటర్లకే. చాలా మంది తమ వీడియోలను వేర్వేరు భాషల్లో డబ్బింగ్, ఎడిటింగ్ చేయిస్తున్నారు. ఇకపై ఒక భాషలో వీడియో చేస్తే చాలు.. ఇతర భాషల్లోకి కూడా ఆటో డబ్ అవుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

