WPL Final : డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ పడింది. బౌండరీలతో చెలరేగుతున్న ఓపెనర్ షఫాలీ వర్మ(20)ను అరుంధతి రెడ్డి పెవిలియన్ పంపింది. దాంతో. 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వస్తూనే లారా వొల్వార్డ్త్ (4 నాటౌట్) మొదటి బంతిని బౌండరీకి పంపింది. మరో ఎండ్లో లిజెల్లీ లీ(22 నాటౌట్) దూకుడుగా ఆడుతోంది. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది ఢిల్లీ.
టాస్ ఓడిన ఢిల్లీ తొలి రెండు ఓవర్లలో 8 పరుగులే చేసింది. లారెన్ బెల్ తొలి ఓవర్లో సింగిల్, ఫోర్.. ఆపై సయాలీ ఓవర్లో మూడు రన్స్ మాత్రమే వచ్చాయి. అనంతరం బెల్ ఒకటే పరుగు ఇవ్వగా.. కానీ, నాలుగో ఓవర్లో లీ రెచ్చిపోయింది. సయాలీ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదింది. షపాలీ సైతం దూకుడు పెంచి రెండు ఫోర్లు కొట్టింది. కానీ, పవర్ ప్లే చివరి ఓర్లో అరుంధతి రెడ్డి ఆమెకు చెక్ పెట్టింది. షాట్ ఆడాలనుకున్న తను.. వికెట్ కీపర్ రీచా చేతికి చిక్కడంతో 49 వద్ద ఢిల్లీ తొలి వికెట్ పడింది.
Timed to perfection 👌
Lizelle Lee gets going early in the #Final 💪
Updates ▶️ https://t.co/9sgUo0YqOI#TATAWPL | #ClaimTheCrown | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/3HFhLk4IY1
— Women’s Premier League (WPL) (@wplt20) February 5, 2026