మలుగు, ఏప్రిల్18(నమస్తేతెలంగాణ) : వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే బిడ్డ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బిళ్ల చందు భార్య రవళికి మొదటి కాన్పులో భాగంగా ములుగు ప్రభుత్వ దవాఖానలో గురువారం అడ్మిట్ చేశారు. నొ ప్పులు వచ్చేందుకు ఇంజక్షన్లు వేసి శుక్రవారం సాధారణ కాన్పు చేసేందుకు ఆపరేష న్ థియేటర్లోకి తీసుకెళ్లారు.
తనకు నొప్పులు రావడం లేదని రవళి చెప్పినప్పటికీ వైద్యురాలు, సిబ్బంది వినకుండా చేతులతో బాగా ఒత్తడంతో పసికందు తల బయటకు రావడంతో గట్టిగా లాగారు. పుట్టింది మగ బిడ్డ అని, కండ్లు తెరవడం లేదని వీపుపై కొట్టినా చలనం లేకపోవడంతో చనిపోయినట్లు తెలిపారు. దీంతో రవళి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యా రు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని తండ్రి బిళ్ల చందుతో పాటు కుటుంబ సభ్యులు దవాఖా న ఎదుట జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
అదే సమయంలో వెంకటాపూర్ మండల కేంద్రంలో భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరయ్యేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని పక్కకు లాగేయడంతో తోపులాటతో పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ పసికందు మృతదేహాన్ని తలపై పెట్టుకొని మంత్రులకు చూపించి నిరసన వ్య క్తం చేశారు. గమనించిన మంత్రి సీతక్క బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని చెప్పి ఆగకుండా వెళ్లిపోయారు. బంధువులు రవళిని పక్కనే ఉన్న ప్రైవేట్ దవాఖానలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. మంత్రులు వాహనాన్ని ఆపి దిగి వచ్చి బాధిత కుటుంబాన్ని ఓదార్చకపోవడం పలు విమర్శలకు దారి తీసింది.
నాకు నొప్పులు రావడం లేదని మొత్తుకున్నా వినలేదు. ఇంజక్షన్లు వేసినా రాలేదు. కడుపు మీద చేతులు పెట్టి కిందకు నొక్కారు. ప్రాణం పోయేలా ఉంది అని చెప్పినా, ఏడ్చినా వినలేదు. చనిపోగానే శిశువు హెల్త్ కండీషన్ సరిగా లేదన్నారు. నా బిడ్డ చావుకు ప్రభుత్వ దవాఖాన, వైద్యు లు, సిబ్బందే కారణం.