Baal Mela | నల్లబెల్లి : బాల్ మేళాల నిర్వహణ బిడ్డల సంరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని ఐసీడీఎస్ పీడీ రాజమణి అన్నారు. ఇవాళ నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెంలో క్లస్టర్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐసిడిఎస్ పిడి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో సంబంధిత అంగన్వాడీ కార్యకర్త విధిగా బాల్ మేళాలు నిర్వహించి 5 ఏండ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలను గుర్తించాలని సూచించారు. అదే విధంగా పిల్లలతోపాటు గర్భిణీల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. పోషక లోపాల నివారణ లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టి.. జిల్లాలోని నల్లవెల్లి మండలం ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి మధురిమతోపాటు అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షురాలు లత, ఆయా కేంద్రాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
Jawahar Nagar | 15 కోట్ల విలువైన సర్కారు భూమి కబ్జాకు యత్నం.. కంచెను ఖతం చేసిన కబ్జాదారుడు ఎవరు..?