హనుమకొండ, డిసెంబర్ 22 : ఏడాది కాలంలోనే కాంగ్రెస్ చేతులెత్తేసి, నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఆయన వి లేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార పాలన కాకుండా ప్రజా పాలనపై దృ ష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో రాష్ట్రంలోని అన్ని పండుగలను అధికారికంగా నిర్వహించామని, ప్రజలు సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఆనందం గా గడిపేలా, కానుకలు అందజేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందిపెడుతున్నదని, వారికి మేలు చేయడం లేదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతోందన్నారు. లగచర్లలో రైతుల భూములను లాకుంటున్నదని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు, హైదరాబాద్ ప్ర తిష్టను దిగజార్చే చర్యలు కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తోందని అన్నారు. కొత్తగా సినిమా ఇండస్ట్రీ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులు, ప్రజల పక్షాన పోరాడుతుంటే కేసులు పెడుతోందన్న దాస్యం ప్రభు త్వ విధానాలపై పోరాటం చేస్తామని, నిలదీస్తామని హెచ్చరించారు. ఇప్పటికైన ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించి ప్రజల మన్న లు పొందాలని వినయ్‌భాస్కర్ హితవు పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే శక్తి లేక ప్రతిపక్షంపై ఎదు రు దాడి చేస్తున్నదనని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎపుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అన్ని తప్పుడు లెక్క లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు చేసుకుంటున్న ప్రభుత్వానికి సంవత్సరం తర్వాత రాష్ట్ర ఆర్థి క పరిస్థితి గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు ఆలోచించలేదని పొన్నాల ప్రశ్నించారు. అసెంబ్లీని వేదికను చేసుకొని కాంగ్రెస్ ప్రభు త్వం అబద్ధాలు చేస్తుందని ఆరోపించారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసి న సంక్షేమ పథకాలు అమలు చేస్తారా.. ఇచ్చిన 420 హామీ లు, ఆరుగ్యారెంటీలను అమలు చేస్తారా.. వీటికి ఎంత డబ్బు అవసరమవుతుందో ప్రజలకు బాహాటంగా చెప్పగలరా అని పొన్నాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అ భివృద్ధి కోసం ఏ ప్రభుత్వమైనా అప్పులు చేస్తుంది.. ఆ మే రకు అభివృద్ధి కూడా జరుగాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్పులు చేసినప్పటికీ అందుకు అనుగుణంగా అభివృద్ది చేసి చూపించారని అన్నారు. 29 రాష్ర్టాల్లో మెరుగైన ఆదాయం మన రాష్ట్రానిదేనని, రాష్ట్ర సంపదకు అప్పుకు ఎంత తేడా ఉందో అసలు తెలుసాఅని సీఎంను ప్రశ్నించారు. రాష్ర్టా ఆదాయానికి సంపద సైతం 10 ఏండ్లలో మూడురెట్లు పెరిగిందని, తలసరి ఆదాయం సైతం మూడు రెట్లు పెరిగిందన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు అప్పులు ఉన్నాయన్న పొన్నాల దేశానికి సైతం ఆదాయంతో సమానమైన అప్పు ఉందని తెలిపారు. అమెరికా 29 ట్రిలియన్ల ఆదాయం కంటే అప్పు ఎకువని, అలాగే జర్మనీ ఆదాయం, అప్పులు సమానంగా ఉన్నాయన్నారు.
రాష్ట్ర ఆర్థికస్థితి గురించి మాట్లాడుతున్న సీఎం ఇటీవల మూసీప్రక్షాళన అన్నారు.. ఆ కార్యక్రమం మీ మ్యానిఫెస్టోలో లేదన్నారు. కూల్చివేతలు, నూతన నిర్మాణాలు, విద్యుత్, ఇతర అన్ని ఖర్చులు కలిపితే రూ.లక్షా 60వేలకోట్ల ఖర్చు అవుతుందన్నారు. మరి అంత బడ్జెట్ ఉందా..? అదనం ఖర్చు ఎకడి నుంచి తెస్తారు.. హామీలు అడిగితే మాత్రం గత ప్రభుత్వం అప్పు లు అంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీని చూస్తుంటే సినిమాహాల్‌ను తలపిస్తుందన్నారు. ఇటీవల మీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చినప్పటికీ వారు అసెంబ్లీలో మాట్లాడిన విధానం, వ్యవహరించిన తీరు చిత్రంగా ఉందన్నారు. అప్పులపై చర్చిస్తామంటే రారు.. మైకు ఇవ్వరు.. నిరసన తెలిపితే ఒప్పకోరని ఎద్దేవా చేసారు. సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది, అదానీ ఇచ్చిన వంద కోట్లు డబ్బులు ఎవ్వరికి పోయాయో ప్రజలకు తెలుసన్నారు. అలాగే ఇంకో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రూ. 200కోట్లు ఇవ్వగానే మంచోడు అయిపోయాడని ఆరోపించారు. చరిత్ర ఎప్పుడై మారదన్న పొన్నాల రాముడు ఎవరో…రావణుడు ఎవ రో ప్రజలకు తెలుసన్నారు. మంచి ఎవరు చేశారో మంచి వైపు ఎవరు నిలిచారో తెలుస్తోందని అన్నారు. లగచర్లను చూస్తే శ్రీలంక పోవాల్సిన పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కావాలటా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాముడైతే… రేవంత్‌రెడ్డి రావణుడని పొన్నాల లక్ష్మయ్య అన్నాడు. ఈ సమావేశంలో కుడా మాజీ చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, బీఆర్ఎస్ నాయకులు నయీమొద్దిన్, మిట్టపల్లి రమేశ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణలు పాల్గొన్నారు.