సర్వమతాల భక్తిభావం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్‌లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభావం వెల్లివిరిసింది.
- సర్వత్రా వెల్లివిరిసిన ఆధ్యాత్మిక పరిమళం
- వైభవంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
- ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలు
- కాళేశ్వరంలో లోక కల్యాణార్థం చండీహోమం
- పలుచోట్ల పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు
- అర్చకులకు సన్మానం, ‘ధూప దీప నైవేద్యం’ ప్రొసీడింగ్ కాపీల అందజేత
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్‌లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభావం వెల్లివిరిసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనడంతో పండుగ వాతావరణం కనిపించింది. అలాగే లోకకల్యాణార్థం కాళేశ్వర-ముక్తీశ్వరాలయంలో చండీహోహం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులకు ధూప దీప నైవేద్యం ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. కేసీఆర్ సర్కారు వల్లే ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని వారు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు శశాంక, కృష్ణ ఆదిత్య, భవేశ్‌మిశ్రా, జడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, జక్కు శ్రీహర్షిణి పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 21
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

