మిర్చితో మార్కెట్ కళకళ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రాకతో కళకళలాడుతోంది. డిసెంబర్ నుంచి కొత్త మిర్చి మార్కెట్‌కు వస్తోంది. సీజన్ ప్రారంభంలో 2వేల నుంచి 10వేల బస్తాల వరకు రాగా సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.
- 20వేల బస్తాలకు పైగా రాక.. నిలకడగానే మిర్చి ధరలు
- వ్యాపారులు, కార్మికుల హర్షం
కాశీబుగ్గ, జనవరి 23: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రాకతో కళకళలాడుతోంది. డిసెంబర్ నుంచి కొత్త మిర్చి మార్కెట్‌కు వస్తోంది. సీజన్ ప్రారంభంలో 2వేల నుంచి 10వేల బస్తాల వరకు రాగా సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఈ నెల 19న అత్యధికంగా 25వేల బస్తాలు వచ్చాయి. సోమ, మంగళవారాల్లో 20వేలకు పైగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు హెచ్చు తగ్గులు లేకుండా నిలకడగానే ఉంటున్నట్లు చెప్పారు. మిర్చి రాక పెరగడంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతోపాటు దడువాయి, గుమస్తా, హమాలీ, ఇతర కార్మికవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు మార్కెట్‌కు 98వేల క్వింటాళ్లు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. మంగళవారం సుమారు 20వేల బస్తాలు వచ్చాయి. తేజ రకం 12,500, వండర్‌హాట్ 500, యూఎస్ 3,413, తాలు రకం మిర్చి 2వేల బస్తాలు వచ్చాయి. అత్యధికంగా తేజ రకం క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.20,400, కనిష్ఠం రూ.14,500, వండర్‌హాట్ అత్యధికంగా రూ.18వేలు, కనిష్ఠంగా రూ.15వేలు, యూఎస్ 341 రూ.16, 500, కనిష్ఠంగా 13వేలు, తాలు మిర్చి రూ.8,800, కనిష్ఠంగా రూ.5500 పలికింది
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

