కాంగ్రెస్‌లో ఇందిరమ్మ కమిటీల చిచ్చు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీల చిచ్చు రగిలింది. తాము సూచించిన వారినే కమిటీలో నియమించాలంటూ మంగళవారం మండల పరిషత్ కార్యలయం బయట గొడవకు దిగారు.
- తమ వారినే నియమించాలంటూ ఇరు వర్గాల గొడవ
- ఎంపీడీవో కార్యాలయం ఎదుట రామచంద్రాపురం నేతల వాగ్వాదం
బయ్యారం, అక్టోబర్ 15 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీల చిచ్చు రగిలింది. తాము సూచించిన వారినే కమిటీలో నియమించాలంటూ మంగళవారం మండల పరిషత్ కార్యలయం బయట గొడవకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ముగ్గరు వ్యక్తుల పేర్లు ఇవ్వాలని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ మంగీలాల్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లును అధికారులు కోరారు. వారిరువురు తమ వర్గానికి చెందిన వేర్వేరు వ్యక్తుల పేర్లను సూచించారు. ఈ క్రమంలో పేర్లను ఫైనల్ చేసేందుకు ఇరు వర్గాలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ గ్రామ నాయకులు పేర్లెలా ఇస్తారని ఒక వర్గం.. మాజీ ప్రజా ప్రతినిధులు పేర్లు సూచించడమేంటని మరో వర్గం నేతలు వాదనకు దిగారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు తమపై పెత్తనం చేస్తున్నారని పాత కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తే.. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశామని, తమకు సముచిత స్ధానం కల్పించాలని కొత్త నాయకులు వాదించుకున్నారు. ఎంతకూ విషయం తేలకపోవడంతో కార్యదర్శి రామస్వామి ఇరు వర్గాలు నాయకులు ఇచ్చిన పేర్లను ఉన్నతాధికారులకు అందించారు. అయితే మండలంలోని మరికొన్ని గ్రామాల్లోనూ ఇలాంటి పంచాయితీలే జరుగుతున్నట్లు తెలిసింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

