వరంగల్, జూన్ 26 : కామేశ్వరీ మాతా అలంకరణలో భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రా రంభించారు. తొలిరోజు ఉదయం అర్చకులు సహ స్ర కలశాభిషేకం నిర్వహించారు.
ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు నేతృత్వంలో అర్చకులు 1008 కలశాలతో అభిషేకం చేశారు. శాకంబరీ ఉత్సవాల్లో భా గంలో తొలి రోజు భద్రకాళీ అమ్మవారిని కామేశ్వరీ మాతగా అలంకరించారు. కార్యక్రమంలో ధర్మకర్త లు తొనుపునూరి వీరన్న, ఆనంతుల శ్రీనివాసరా వు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీశ్, మోతుకూరి మ యూరి, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగు ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
శాకంబరీ ఉత్సవాల తొలి రోజు భద్రకాళీ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కామేశ్వరీ మా తా అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని తరించారు. భ క్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శంచుకున్న వారిలో కమర్షియల్ ట్యాక్స్ డైరెక్టర్ హరిత, డాక్టర్ లలితాకుమారి తదితరులు ఉన్నారు.