తొలకరి పలకరించె..
తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.
- హనుమకొండలో మోస్తరు వర్షం
- జిల్లాలో అక్కడక్కడా జల్లులు
- నగరవాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం
- నైరుతి రాకతో రైతుల్లో సంబురం
హనుమకొండ చౌరస్తా, జూన్ 21: తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. ఇన్ని రోజులు ఎండకు ఉక్కిరిబిక్కిరి అయినా ప్రజలు తొలకరి వానతో కొంత ఉపశమనం పొందారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. ఎన్నో ఆశలతో రైతులు వర్షాకాలం సాగుకు శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో పంట భూముల్లో రైతులు, రైతు కూలీల కోలాహలం కనిపించింది.
నగరంలోని ప్రజలు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వ్యవసాయ పనులతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలు వ్యవసాయ క్షేత్రాల్లో పొలం పనులు ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాలతో జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో రైతులు విత్తనాలు వేసే ప్రక్రియ ఆరంభమైంది. మరో రెండు, మూడుసార్లు భారీ వర్షాలు కురిస్తేనే విత్తనాలు వేసుకోవాలని, భూమిలో వేడి తగ్గే వరకు ఆగాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఆలస్యంగా పలకరించిన వర్షానికి రోడ్లు జలమయ్యాయి. ఉదయం నుంచి తీవ్రమైన ఎండతో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడటంతో ప్రజలు, రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

