హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ నిర్వహించనున్నట్టు సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వనపట్ల సుబ్బయ్య, మల్లోజుల విజయ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్, ఆత్మీయ అతిథులుగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఉద్యోగ సంఘ నాయకుడు దేవీప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ హాజరుకానున్నారు. జెన్జీ ఉద్యమం ప్రభావాలు, పరిణామాలు అంశంపై ప్రముఖ సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ స్మారకోపన్యాసం ఇవ్వనున్నారు.