సైదాబాద్, ఆగస్టు 4 : స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన సైదాబాద్ సింగరేణికాలనీలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్ సింగరేణికాలనీ వాంబే కార్వర్టర్స్లో నివసించే ఆమేర్ (40)ఆటో డ్రైవర్. అదే ప్రాంతంలో నివసించే నల్గొండ జిల్లా దేవరకొండ సంధ్యా తండాకు చెందిన ఇంద్రావత్ సుమన్ కూడా ఆటో డ్రైవరే. ఇద్దరు పాతనేరస్తులు. స్నేహితులు కావటంతో ఇద్దరు కలిసి కొంత కా లంగా అక్రమంగా గంజాయి వ్యాపా రం చేస్తున్నారు.
గంజాయి ముఠాలతో సంబంధాలు ఉండటంతో తరుచు సుమన్ ఇంట్లో కలుసుకునే వారు. కాగా సుమన్ కుటుంబ సభ్యులతో హమేర్ కొన్ని రోజుల క్రితం అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించాడు. దీంతో ఎలాగైనా హమేర్ను హతమార్చాలని సుమన్ పథకం వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఇద్దరు కలిసి మద్యం, గంజాయి తాగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సుమన్ తన వద్ద ఉన్న కొబ్బరి బోండాలను కొట్టే కత్తితో అందరు చూస్తుండగా విచక్షణరహితంగా హమేర్ను దారుణంగా హత్య చేశాడు.
నిందితుడు అక్కడి నుంచి నేరుగా సైదాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. వెంటనే క్లూస్ టీం పోలీసులు, సైదాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి, సైదాబాద్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.