ఖిలా వరంగల్ : పెరిక కుల వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఖిలా వరంగల్ తూర్పు కోటకు చెందిన అల్లం రాజేశ్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పెరిక కుల వెబ్సైట్ ప్రారంభోత్సవం, సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్ ప్రకటించారు. అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా కుల సంఘం ప్రతినిధులకు, కుల పెద్దలకు రాజేశ్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో కుల ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
Pratyusha | దివగంత నటి ప్రత్యూష బయోపిక్.. ప్రధాన పాత్రలో నేషనల్ క్రష్
Actor Vijay | పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభ.. ర్యాలీలోకి తుపాకీతో చొరబాటుకు వ్యక్తి యత్నం..!