హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) నిర్వహణ సంక్షోభం వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి (Flights Cancelled). విమాన సర్వీసుల క్యాన్సిలవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మొత్తం 58 విమానాల రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు ఉండగా, హైదరాబాద్కు రావాల్సిన 14 విమాన సర్వీసులు ఉన్నాయి. సోమవారం క్యాన్సలేషన్ల సంఖ్య 77గా ఉన్నది. వీటిలో 38 అరైవల్స్, 39 డిపార్చర్స్ ఉన్నాయి.
ఇక ఏపీలోని విశాఖపట్నం నుంచి 6 విమానాలు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లాల్సిన సర్వీసులు ఉన్నాయి. అదేవిధంగా చెన్నైలో 41 విమానాలు, బెంగళూరు విమానాశ్రయంలో 121 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది.