హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 30: బంగారం అంటే ఎంతో ఇష్టం.. ఇక పర్వదినాల్లో అయితే ఖచ్చితంగా కొనుగోలు చేయాలనే ధృడనిశ్చయంతో ఉంటారు. బుధవారం నగరంలో అక్షయ తృతీయ పండుగ సందడి నెలకొంది. ఈ క్రమంలో బంగారం ధరల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. అక్షయ తృతీయ కావడతో బంగారం కొనుగోళ్ల కోసం ప్రజలు పెద్దఎత్తున క్యూ కడుతున్నారు.
బుధవారం బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే ప్రజలు, వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్న దుకాణాలకు వెళ్తున్నారు. సిరి పెరల్స్షాపు యజమాని శివ మాట్లాడుతూ బంగారం ధర పెరగడంతో అనుకున్న దానికన్నా కస్టమర్లు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. బంగారం ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం అస్సలు తగ్గడం లేదంటున్నారు.