‘కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డం.. కరెంటు ఉండక, నీళ్లు పారక పొలాలు ఎండి ఏడ్చినం.. ఆరుగాలం కష్టం చేతికి రాక గుడ్లళ్ల నీళ్లు గుడ్లళ్లనే కుక్కుకున్నం. ఆ రోజులు తలుసుకుంటెనే భయమైతాంది.. అవి పీడదినాలు. మళ్ల ఆ రోజులు రావద్దని కోరుకుంటున్నం. బీఆర్ఎస్ పాలనలోనే ఎవుసం మంచిగైంది. రైతులకు ఏంకావాల్నో తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండుడు మా అదృష్టం.. ఆగంజేసే కాంగ్రెస్ వద్దు.. అండగ ఉన్న బీఆర్ఎస్కే మా మద్దతు’ అని రైతులు, ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. మూడు గంటల కరెంటు వ్యవసాయానికి ఏ మూలకూ సరిపోదని, 24గంటల కరెంటు ఉంటేనే ఏటైముకు నీళ్లు పెట్టాలన్నా వీలుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక ధరణిని లేకుండజేస్తామని అంటున్న కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరని, దళారుల రాజ్యం వస్తే చీకటి రోజులేనని ఘంటాపథంగా చెబుతున్నారు.
రాయపర్తి : కొన్నేండ్ల కాన్నుంచి కరెంట్ విషయంలో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో రైతులంతా సంతోషంగా పంటలు పండించుకుంటాన్రు. ఎనుకట ఎవుసానికి పొద్దాంక మూడు గంటలు, తెల్లందాక నాలుగు గంటలు ఇచ్చేదాయె. దాంతోటి పారిన దొయ్యే పారేది. తడిసిన కాలువే తడిసేది. కష్టపడి ఏసిన పంటలను కాపాడుకునేందుకు తెల్లంగదెల్లార్లు బాయిల కాడ.. బోర్ల కాడనే పండుకునేది. రైతులంతా వరి నాట్లు వేయంగనే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేది. మోటర్లు, స్టాటర్లు కాలిపోయేది. అప్పట్ల ఆటోమేటిక్ స్టార్టర్లు లేని బాయిలే లేకుండె.. కానీ గిప్పుడా పరిస్థితులు లేవు. స్టార్టర్లను ఏనాడో అటక ఎక్కిచ్చినం. సారు కడుపు సల్లగుండ ఇరాం లేకుండా కరెంట్ ఇస్తుండడంతో పంటలు బగా పండుతానయ్. మేము చేసిన కష్టం అక్కెరకు వత్తాంది. కరెంట్‌ను తీసేసినా.. కరెంట్ గురించి తప్పుగా మాట్లాడే పార్టీలు ఈ ఎలక్షన్లో నామరూపాలు లేకుండా కొట్టుకుపోతయ్.
‘కాంగ్రెస్ హయాంల రాత్రింబవళ్లు కలిపి రైతులకు కరెంటిస్తే బావుల కాడనే కాపుగాసినం. సబ్స్టేషనోళ్లకు ఫోన్జేసి కరెంటు ఎప్పుడస్తదని అడిగితే మాకేం తెల్వదు.. పైననే పోయిందనేటోళ్లు. రాత్రిపూట టార్చిలైట్లు పట్టుకొని బాయిల కాడికి పోయి నీళ్లు పారించినం. గంతెందుకు ఊళ్లె ఎవలన్న సచ్చిపోతె స్నానాలకు కూడా మోటరు వెట్టుదామంటే కరెంటు ఉండకపోవు’ అంటున్నారు రైతులు. కాంగ్రెస్ పాలన అంతా చీకటి రోజులని, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ పాలనలోనే తమ బతుకులు బాగుపడ్డాయని చెబుతున్నారు. నాడు ఎరువులు, విత్తనాల కోసం క్యూలో నిల్చునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దేనికీ బాధపడే పరిస్థితి లేదని అంటున్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తదని, రోజురోజుకూ పంచాయితీలు పెరుగుతయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు వల్లనే భూములకు విలువ పెరిగిందని, ఇప్పుడు మళ్లీ రైతులను ఆగంజేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ‘రైతుల గురించి ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ మాకెందుకు.. ఎప్పుడూ మా శ్రేయస్సు కోరే కేసీఆరే మళ్లీ రావాలి’ అని కుండబద్దలు కొడుతున్నారు. – నమస్తే తెలంగాణ
రాయపర్తి : ధరణి పోర్టల్ రైతుల పాలిట కల్పవృక్షంగా మారింది. ఇప్పుడు భూ రికార్డుల తారు మారు, రికార్డుల్లో ప్రతిసారి మార్పులు-చేర్పులు, ఒకరి భూమి ఇంకొకరికి, ఇంకొకరి భూమి మరొ కరికి పట్టా మార్పిడి చేయడం వంటి బాధలు లేకుండా పోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త పాసు పుస్తకాల వల్ల రైతులకు ఎటువంటి బాదరబందీ లేదు. ధరణి ఉండాల్సిందే. దాన్ని తీసేస్తే మాత్రం రైతుల ఆగ్రహ జ్వాలల్లో మాడి మసికాక తప్పదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతుకు మేలు చేసింది. రైతులందరూ వారి వెంటే నడుస్తారు.
కాశీబుగ్గ: కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్‌ను మార్చేసి కౌలురైతు కాలమ్ ఏర్పాటు చేస్తే అసలు రైతు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కౌలుదారు రైతుల పేర్లు నమోదు చేయడంతో అసలు భూమి యజ మానులకు భవిష్యత్తులో ఎసరు తప్పదు. కౌలు చేసేవారికి కాగితం రాసిస్తే భూ యజమానికి తన హక్కులను కోల్పోయే అవకాశం ఉంది. తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణితో ఎవరి భూమి వారికే ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు లేవు. రైతులు, భూస్వాములు నిమ్మలంగా ఉన్నారు. ఊళ్లలో రైతులు కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఉన్నారు. ధరణిని మార్చేస్తే నిత్యం గొడవలు జరుగుతాయి. గ్రామాల్లో శాంతిభద్రతలు కరువవుతాయి. భూయజమానులు కౌలుకు ఇవ్వరు. భూములు బీడుగా మారుతాయి. వ్యవసాయం చాలా వరకు తగ్గుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రైతులకు మేలు.
పర్వతగిరి: కాంగ్రెస్ ధరణి తీసేసి, కౌలు దారులను రికార్డుల్లో ఎక్కిస్తామని చెబు తోంది. కౌలు దున్నే వాళ్లకు హక్కులు కల్పిస్తే భూమి ఆగమైతది. గివన్నీ ఆలోచించే సీఎం కేసీఆర్ పెట్టిన ధరణితో రైతులకు ఎంతో మేలు కలిగింది. ధరణి తీసేసి అనుభవ దారుగా కౌలుదారుల పేరు రికార్డుల్లోకి ఎక్కిస్తే రెండేండ్లు దున్నినంక ఈ భూమి తనదే అంటాడు. వారి మధ్య గొడవలు జరిగి ఇబ్బందులు వస్తాయి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే రూ.10వేల కోసం రూ.లక్షల విలువైన భూ మికి ఎసరు వస్తుంది. సీఎం కేసీఆర్ సారు రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ధరణి పెట్టడం మంచిగుంది. గతంలో రాత్రి కరెంటుతో చాలా ఇబ్బందులు పడ్డాం. అర్ధరాత్రి మోటరు పెట్టడానికి బాయికాడికి పోయి గోస పడ్డాం. ఇప్పుడు కేసీఆర్ సారు 24గంటల కరెంటు ఇస్తున్నందున సంతో షంగా ఉన్నాం. రైతులకు అన్ని సమకూ ర్చుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ వైపే అన్నదాతలు మొగ్గు చూపుతారనడంతో ఎలాంటి సందేహం లేదు.
హనుమకొండ సబర్బన్ : భూమి రిజిస్ర్టేషన్ చేసుకు న్న ఒక్క రోజులోనే మన పట్టా పాసు బుక్కులో రికార్డు లను ఇప్పుడు అధికారులు నమోదు చేస్తున్నారు. ఇదివ రకు ఇలా ఉండేది కాదు. మ్యుటేషన్ కావాలంటే నెలలు పట్టేది. రికార్డుల్లో మళ్లీ పాత వివరాలు పెట్టి ధరణిని రద్దు చేస్తామని చెప్తున్న కాంగ్రెస్‌కు రైతులు బుద్ధ్ది చెప్తా రు. రైతులను అరిగోస పెట్టడానికి మళ్లీ పాత పద్ధతులను అవలంబిస్తారా? ధరణి వచ్చినప్పటి నుంచి రైతులు భూ ముల రక్షణ విషయంలో నిశ్చింతగా ఉంటున్నాం. మళ్లీ పాత వీఆర్వో, వీఆర్ఏ, ఆర్ఐల చుట్టూ రైతులను తిప్పా లని కాంగ్రెస్ చూస్తుందేమో. మళ్లీ మేము ఆ బాధలు పడలేం. పొరపాటున కూడా కాంగ్రెస్ పాత విధానాలను అవలంబిస్తే తిప్పలు తప్పవు. రైతులందరూ ఈ విష యంలో జాగ్రత్తగా ఉండి ఆలోచనతో ఓటు వేయాలి.
హసన్‌పర్తి: కేసీఆర్ సారు ధరణి తెచ్చుడుతోనే గ్రామాల్లో భూసమస్య లు పరిష్కారమయ్యాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీఆర్వో లు పైసలు తీసుకొని ఒకరి భూమి మరొకరి పేరు మీదికి మార్చేవారు. గ్రామాల్లో నిత్యం గొడవలు జరిగేవి. భూముల పంచాయితీలు నిత్యం పోలీస్స్టేషన్ల చుట్టూ పెద్ద మనుషులు తిరిగి ఇద్దరికి డబ్బులు ఖర్చయ్యే వి. భూములు రిజిస్ట్రేషన్ కావాలంటే పొలం పనులు మానేసి దళారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి నానాయాతన పడేది. అయినా రిజిస్ట్రే షన్లు ఎప్పుడు అయితయో తెల్వకపోయేది. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చిన తర్వాత భూములకు భద్రత పెరిగింది. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న ఒక్క రోజులోనే తహసీల్దార్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ చేసి, పాస్బుక్కు ఇస్తాండ్లు. ధరణితోనే భూములకు భద్రత ఉన్నది. దళారుల వ్యవస్థ పోయి రైతులకు మేలు జరిగింది. ధరణి ఉండాల్సిందే. కేసీఆర్ సార్ మల్ల రావాల్సిందే.
ఐనవోలు: ధరణి తెచ్చిన తర్వాత భూములకు భద్రత పెరిగింది. ఎవరి భూములపై వారికే పూర్తి అధికారాలు వచ్చాయి. భూమి అమ్మినా, కొన్నా ఎవరి పైరవీలు లేకుండానే పట్టాదారు పాస్బుక్కులకు మారుతున్నది. గతంలో రైతు అవసరాల కోసం అమ్మాలన్నా, కొనాలన్నా తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయా ల చుట్టూ తిరిగాల్సి వచ్చేది. నాడు కార్యాలయానికి పోతే తహసీల్దార్, వీఆర్వో ఉంటడో లేడో, లేకపోతే ఈ రోజు పని అయితుందో లేదో.. అనే భయం ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే రైతు తహసీల్ ఆఫీస్‌కు వచ్చే దాక తహసీల్దార్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ రైతుకు లేటు అయితే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీరు వస్తున్నారా? అని అడుగుతున్నరు. అంటే ధరణి వచ్చాక, భూమిపై పూర్తి అధికారం రైతుకే వచ్చింది. ధరణి పోతే పైరవీకారుల రాజ్యం వస్తుంది.
నడికూడ : కాంగ్రెస్ పార్టీ వాళ్లు 10హెచ్‌పీ మోటర్లు బిగించుకోవాలని అంటున్నారు. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్నది. పెద్ద భూస్వాములు ఆ ఖర్చులను భరిస్తారు గాని పేద రైతులు ఎలా భరిస్తరు..? గ్రామాల్లో 90శాతం రైతులు చిన్న కమతాలనే కలిగి ఉన్నరు. వారికి 3హెచ్‌పీ మోటర్లే ఎక్కువ. అలాంటిది చిన్న భూములకు పెద్ద మోటర్లు పెట్టడం తెలివి తక్కువ పనే అవుద్ది. కాంగ్రెస్ నాయకులు చెపుతున్న మోసపూరిత మాటలను ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ వచ్చినంక ఇప్పుడు రైతులు వ్యవసాయం మీద ఇంకా శ్రద్ధ చూపుతున్నారు. కానీ, కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజుల్లానే రైతులు భూములను తక్కువ ధరలకు అమ్ముకుని పోవాల్సిందే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతులకు అన్ని సౌలతులు కల్పించిండు. ఎప్పుడూ ఆయన వెంటే మేముంటాం.
కాజీపేట : కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి ఇస్తామన్న మూడు గంటల కరెంట్‌తో ఎవుసం సాగదు. రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్‌తోనే వ్యవసాయం చేయవచ్చు నని అంటుండు. మూడు గంటల కరెంటుతో ఎకరం భూమికి కూడా నీళ్లు సరిగా పారై. అది ఎట్లా సాధ్యమై తది? గతంలో కరెంట్ కోసం చాన ఇబ్బందులు పడ్డాం. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం, వచ్చినా చీటికిమాటికి పోవడంతో బాయిల కాడ మోటర్లు కాలిపోవడంతో ఖర్చుల పడేటోళ్లం. చీకట్ల బాయిల కాడికి పోయి మస్తు కష్టాలు పడ్డం. గా బాధలు తలుసుకుంటె ఏడుపొస్తది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ 24 గంటల కరెంట్‌ను అందించిండు. ఇప్పుడు మూడు పంటలు తీస్తూ సంతోషంగ ఉన్నం. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కే ఓటు వేస్తాం.
వర్ధన్నపేట: వ్యవసాయంపై కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం అవగాహ న లేదు. ఆరుగాలం కష్టపడితే తప్ప పంటలు పండవు. మెరుగైన కరెంటు సరఫరా, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అవసరం ఉంటా యి. ప్రధానంగా పెట్టుబడి పైసలు కావాల్సి ఉంటది. ఈవిషయాలన్నీ తెలిసిన సీఎం కేసీఆర్ రైతులకు ఇవన్నీ అందిస్తున్నడు. కాంగ్రెస్ నాయకు లకు గివేవీ తెలియవు. అందుకే వాళ్లు కరెంటు మూడు గంటలు సరిపోత దని, రైతుబంధు అవసరంలేదని, ధరణిని తీసేస్తామని చెబుతున్నరు. చేతిపహాణీలు, రికార్డుల తప్పులతో 70 ఏళ్లు ఇబ్బందులు పడ్డం. వాటన్నింటినీ పరిష్కరించేందుకు కేసీఆర్ సార్ ధరణి తీసుకువచ్చి సరిచేసి, భూమిపై సర్వ హక్కులు రైతులకు వచ్చేలా చూసిండు. కాంగ్రెస్ నాయకు లేమో మళ్లీ సమస్యలు తెస్తామంటున్నరు. కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరు. కేసీఆర్ సార్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమైతయి.
హనుమకొండ : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న 24 గంటల ఉచిత కరెంటుతో ఎంతో సంతోషంగ ఉంటున్నం. గతంలో పడ్డ తిప్పళ్లు ఇప్పుడు లేవు.. పొద్దంతా సమయం ప్రకారం బావుల వద్దకు వెళ్లి మోటర్లు పెట్టుకొని ఇతర పనులు కూడా చేసుకుంటున్నం. గతంలో రాత్రి పూట కరెంటు ఇచ్చే క్రమంలో బావుల వద్దకు వెళ్లి షాక్‌లతో, విష పురుగులు, పాములు కుట్టడంతో అనేక మంది చనిపోయారు. ఇప్పుడు అలాంటి భయం ఏమి లేదు. హాయిగా వెళ్లి ఎప్పుడు పడితే అప్పుడే నీళ్లు పట్టుకుంటున్నం. గతంలో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయేవి. ఇప్పుడు నీళ్లు ఉండడంతో పంటలు కూడా మంచిగా పండుతున్నయి. మద్దతు ధర కూడా వస్తుంది. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు ఇస్తామని అనడం రైతులను ఆగం చేసినట్టే. రైతుల సంక్షేమం అంటున్న ఆ పార్టీ నాయకులు ఇచ్చే మూడు గంటల కరెంటు కనీసం నారుమడి వెడల్పు కూడా తడవదు. బాగుపడ్డ వ్యవసాయాన్ని కాంగ్రెస్ నాయకులు ఖరాబ్ చేసేటట్టు ఉన్నరు. 10 హెచ్‌పీల మోటర్ పెట్టాలని కాంగ్రెసోళ్లు అంటున్నరు.. మోటర్ కొనాలంటే రైతులు అంత మొత్తం పెట్టలేరు. ఒక వేళ కొనాలంటే మళ్లీ అప్పులు చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు విని రాష్ట్రంలోని రైతులు ఎవ్వరూ మోసపోవద్దు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రైతులు మరింత సంతోషంగ ఉంటరు.
రాయపర్తి : ఏనాడు ఊళ్లల్ల మొఖం చూపించని కాంగ్రెస్ పార్టీ నాయకులు గిప్పుడు ఎలక్షన్ల టైం రాంగనే వానపడంగనే చెర్లళ్లకు కప్పలు వచ్చి సప్పుడు చేసినట్లు నోటికొచ్చినట్టళ్ల మాట్లాడుతున్నరు. వారు మాట్లాడే మాటలకు.. చేసే పనులకు పురి కలవడం లేదు. సక్కదనంగ కేసీఆర్ సారు ఎవుసానికి 24 గంటల కరెంట్ ఇస్తాంటే ఈయనొచ్చి 3 గంటలని ముచ్చట్లు చెప్పుతాండు. మరి ఈయనకేమన్న ఎవుసం ఉన్నదో, లేదో తెల్వదు. అసలు మూడు గంటలు ఎలా సాలుద్దో వాళ్లకే తెలువాలె. రైతులమైతే ఆయన మాటలను పట్టించుకోం. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. గీ తీరుగ మాట్లాడుతున్న కాంగ్రెస్‌కు ఓటేసేదే లేదు. మళ్లా కారునే గెలిపించుకుంటాం. రైతులను సల్లంగ కాపాడుతున్న కేసీఆర్‌కు అండగా ఉంటాం.
మడికొండ: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్లిచ్చే మూడు గంటల కరెంటు ఎటూ సరిపోదు. నీళ్లు పారించడం కూడా కానిపని. అప్పట్లో నీళ్లు పెట్టేందుకు బావుల కాడికి చీకట్లో వెళ్లేటోళ్లం. కేసీఆర్ సరారు వచ్చినంక 24గంటల కరెంటు వస్తున్నది. ఎప్పుడంటే అప్పుడు ఇబ్బందులు లేకుండా నీళ్లు పారించగలుగుతున్నం. మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే పాత రోజులే వస్తాయి. 3గంటలు ఇచ్చి 10 హెచ్‌పీ మోటర్తో నీళ్లు పారించాలంటే మోటర్ కోసం ఎకడికి వెళ్లాలి. ఇది అయ్యే పనికాదు. సీఎం కేసీఆర్ ఇచ్చే 24గంటల కరెంటుతోని మంచిగ నీళ్లు పారించుకుంటున్నం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు మళ్లీ మొదలవుతాయి.