నడికూడ, (పరకాల) అక్టోబర్ 29 : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మూడోసారి పార్టీని గెలిపిస్తాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత, 2వ వార్డుకు చెందిన బీజేపీ అధ్యక్షుడు బొచ్చు సంపత్ ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఆనాడు కరెంట్ కష్టాలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. నేడు స్వరాష్ట్రంలో 24గంటల ఉచిత కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి, సామాన్యుల నడ్డి విరిచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్, బీజేపీల నైజమన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎల్తురి సంపత్ వర్ధన్, రేణికుంట్ల రాహుల్, బొట్ల విష్ణు, బొజ్జ వినయ్, అర్రే చంటి, చంద్రగిరి ప్రవీణ్, చంద్రగిరి నవీన్, రోకండ్ల శేఖర్, దండ్ర ఆదిత్య, పాసుల రాకేశ్, రోకండ్ల వికాస్, కొయ్యడ ప్రవీణ్, ఒంటేరు సమేదర్, సిలువేరు రమేశ్, సందీ, కోటి, చినూన, బాలు, మహేశ్ ఉన్నారు. అలాగే, నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామం నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ గ్రామ ఉపాధ్యక్షుడు బాషిక శ్రీనివాస్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి గూడూరు మధుకర్, సామాజి ప్రసాద్, రాజమల్లు, సాంబయ్య, మన్తేపురి కుమార్ (జానీ), సామాజి రాజేందర్ (కోటి), సారయ్యతో పాటు 50మంది వరకు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, జడ్పీటీసీ కోడెపాక సుమలతా కరుణాకర్, సర్పంచ్ రేకుల సతీశ్, సుదాటి వెంకన్న, గోల్కొండ సదానందం, గుడికందుల శివ, దేవేందర్ పాల్గొన్నారు.
ఆత్మకూరు : ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు అర్షం విక్రమ్ ఆదివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పార్టీకి విధేయంగా పనిచేసే వారికి కచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో యువతకు ప్రాధాన్యం ఉస్తున్నామన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బలరాం, గ్రామ పార్టీ అధ్యక్షుడు మానగాని సాంబమూర్తి, సీనియర్ నాయకులు ఓదేల రమేశ్, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.