ACB raids | మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ నుండి విద్యార్థులకు అందిస్తున్న కాస్మొటిక్ వస్తువులు, విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాలతో అందించడం లేనది పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ అధికారి సాంబయ్య తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ నుండి విద్యార్థులకు అందించిన కాస్మొటిక్ వస్తువులు, విద్యార్థుల భోజన సదుపాయాలకు అందించిన వాటిలో మెనూ ప్రకారం పాటించటం లేదని కళాశాలలో బాలికల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా, తాగునీటి సదుపాయం, టాయిలెట్స్, డ్రైనేజీ వంటి అన్ని వసతులు సక్రమంగా లేవని తనిఖీలల్లో తేలినట్లు తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రోలాజికల్ జిల్లా ఆడిట్ అధికారులు సమన్వయంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంకూడా అందించడం లేదని తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేసి ఉన్నతాధికారుల ఆదేశానుసారం బాధ్యులపై చర్యలు ఉంటాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.