కాశీబుగ్గ: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.40వేలు పలికింది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.25వేలు ఉండగా క్రమంగా పెరుగుతూ ఇటీవల రూ.38వేలు పలికింది. సోమవారం కర్నూలు జిల్లాకు చెందిన రైతు బి.అలీపీర్ దేశీ రకం మిర్చి 40 బస్తాలు తీసుకురాగా హారిక ట్రేడింగ్ కంపెనీ అడ్తి ద్వారా ఖరీదు వ్యాపారి సాయిమహేశ్వర్ కొనుగోలు చేశాడు.
500 బస్తాలు రాగా అత్యధికంగా క్వింటాల్‌కు రూ.40వేలు, మధ్య రకం రూ.37వేలు, కనిష్ఠంగా రూ.30వేలు ధరలు పలికాయి. ఈ సీజన్లోనే అత్యధికంగా ధరలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సుమారు 40వేల మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.