మున్సిపోల్స్ ప్రశాంతం.. ఓటేసేందకు పోటెత్తిన పట్టణవాసులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80.64 శాతం పోలింగ్
- మందకొడిగా ప్రారంభమై ఊపందుకున్న ఓటింగ్
- అత్యధికంగా వర్ధన్నపేటలో 86.23, అత్యల్పంగా భూపాలపల్లిలో 65.28 శాతం
- వీలు చైర్లు లేక వృద్ధులు, దివ్యాంగుల తిప్పలు
- అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు
నమస్తే తెలంగాణ నెటవర్క్, ఫిబ్రవరి 11 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పరకాల, భూపాలపల్లి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, ములుగులోని పలు వార్డుల్లో ఓటేసేందుకు పట్టణవాసులు పోటెత్తారు. పోలింగ్ ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేశారు. కొన్ని కేంద్రాల్లో ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది. వృద్ధులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన యువత ఉత్సాహంగా కేంద్రాలకు తరలివచ్చారు.
ఉద్యోగ, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు రావడంతో వార్డుల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. 12 మున్సిపాలిటీల్లో 3,35,272 మంది ఓటర్లకు 2,63,283 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80.64 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వర్ధన్నపేటలో 86.23, అత్యల్పం గా భూపాలపల్లిలో 65.28 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా, జనగామలోని 5వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భూపాలపల్లిలోని 30వ వార్డులో ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ 13వ వార్డు లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య, మహబూబాబాద్ 21వ వార్డు పోలింగ్ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయ క్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, సామగ్రిని సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అక్కడ పటిష్ట పో లీస్ భద్రతను అధికారులు ఏర్పా టు చేశారు. కాగా, ఈనెల 13న ఓట్ల లెకింపు జరుగనుంది.
గొడవలను సద్దుమణిగించిన పోలీసులు
మహబూబాబాద్ 9వ వార్డులోని శనిగపురం పోలింగ్ బూత్‌లో నకిలీ ఓటు వేశారని, బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. కొంత సేపు వారి మధ్య ఘర్షణ జరగగా, పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జీవంతరావుపల్లి పోలింగ్ కేంద్రంలోకి గుర్తుతెలియని వ్యక్తి ఓటు వేసేందుకు రాగా గుర్తించిన బీజేపీ నాయకులు అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు గొడవను సద్దుమణిగింపజేశారు. ములుగు 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఇంటిపై మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీ మద్యం సీసాలను పగులగొట్టినట్లు బాధితులు తెలిపారు. వర్ధన్నపేటలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను తండావాసులు అడ్డుకున్నారు. తండాలను మున్సిపాలిటీ నుంచి వేరు చేస్తామని చెప్పి తిరిగి ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఎందుకు వస్తున్నారంటూ నిలదీసేందుకు యత్నించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను చెదరగొట్టారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఇబ్బందులు..
జనగామ, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో సరైన నిర్వహణ, ఏర్పాట్లు లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వీల్ చైర్లు అందుబాటులో ఉంచకపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులను సహాయకులు చేతులపై మోసుకెళ్లాల్సి వచ్చింది.

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

