హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు.
సోమవారం ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని, ఈ నెల 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతామని, 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 22న సీట్లు కేటాయిస్తామని శ్రీదేవసేన తెలిపారు.