KTR | రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పని కూడా అయిపోయింది.. మోసం చేసి రేవంత్ రెడ్డి పంచన చేరిండు. ఎందుకు చేరింది.. ఘన్సిమియా గూడ కోసమా.. అక్కడ ఉండే భూముల కోసమా..? సుల్తాన్ పూర్ కోసమా..దేనికి పోయినవ్ మాకు తెల్వదా.. విడిచిపెడతమనుకుంటున్నవా..? అని కేటీఆర్ హెచ్చరించారు.
మా ప్రభుత్వం వచ్చినంక ఒక్కొక్క ఇంచు ఎక్కెక్కడైతే లుచ్చా పనులు చేస్తున్నరో.. వదిలిపెట్టం. ఎవరెవరైతే ఇవాళ రెచ్చి పోయి పనిచేస్తున్నరో.. అక్కడ అమ్ముడుపోయి వ్యవహారం చేస్తున్నరో.. అన్నీ తెలుసు.. తెల్వదని మీరనుకుంటున్నారు.. ప్రతీ దానికి టైం వస్తది.. ఇవాళ కొన్ని వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతా ఉన్నయి.. ఏం ఫర్వాలేదు.. టైం వస్తది.. వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేసి చూపెడతామన్నారు.
మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పని కూడా అయిపోయింది
మోసం చేసి రేవంత్ రెడ్డి పక్కన చేరాడు
ఘన్సిమియా గూడ భూముల కోసమా, సుల్తాన్పూర్ కోసమా? దేని కోసం పోయావో మాకు తెలియదు అనుకుంటున్నావా?
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లుచ్చా పనులు చేస్తున్న ఎవరిని వదిలిపెట్టము
– కేటీఆర్ pic.twitter.com/0YwRZkpN4o
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2026
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు!
రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ @KarthikIndrAnna ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/qpXE2VbmiE
— BRS Party (@BRSparty) September 27, 2026
Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలు
The Paradise | వీక్ డేస్లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్!