న్యూఢిల్లీ, ఆగస్టు 16 : పాచిపోయిన ఆహారం దుర్వాసన వేసినట్టుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం కూడా అవే అరిగిపోయిన మాటలు, అదే పటాటోప కబుర్లు దేశ పౌరులను విసిగించింది, విముఖత పుట్టించింది. 2014 సే పహాలే (2024 లోపు), 2047 మే వికసిత్ భారత్ (2047లో ప్రగతిశీల భారత్) అనే తన రెండు ఇష్టమైన నినాదాల మధ్య ఊగిసలాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఏమీ చెప్పలేక పోయారని, ప్రజలకు పాచిపోయిన అన్నాన్నే వడ్డించారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కే ఝా ‘ద వైర్’ వెబ్సైట్లో విశ్లేషించారు.
చిన్నపిల్లలను మీకేమి వచ్చు అంటే వారు నేర్చుకున్న రైమ్స్ను పాడినట్టుగా, ప్రధాని కూడా పాత విషయాల పటాటోపంతో గలగలలాడారు. మేక్-ఇన్ ఇండియా, ఆత్మనిర్బర్ భారత్, ఫ్రాజైల్ ఫైవ్, స్టార్టప్ ఇండియా, గ్యాస్ కనెక్షన్, పేదలకు ఇండ్లు, మరుగుదొడ్ల్లపై తన పాత పాటనే విన్పించారు. తనను సమర్థించని వారందరినీ ఆయన ‘దిమాగీ నక్సల్స్’గా పిలుస్తారు. వికసిత్ భారత్ వల్ల యువతరమే లబ్ధి పొందుతారన్న తన మాటను నమ్మాలని ఆయన భావిస్తారు. అని సంజయ్ పేర్కొన్నారు.