మళ్లీ బీఆర్ఎస్దే అధికారం
రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతు సీఎం కేసీఆర్‌కే ఉన్నదని, రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోని రానున్నది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
- అన్ని వర్గాల మద్దతు సీఎం కేసీఆర్‌కే..కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు
- కర్ణాటకలో 5 గంటల కరెంటుకే దిక్కులేదు
- తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- బీఆర్ఎస్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి భారీగా చేరికలు
- గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన చల్లా
పరకాల, నవంబర్ 2 : రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతు సీఎం కేసీఆర్‌కే ఉన్నదని, రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోని రానున్నది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే చల్లా గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. 60 ఏండ్లుగా జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో జరిగిందని, అభివృద్ధిని చూపి అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిర్ర సారంగపాణి, బీజేపీ ఓబీసీ మండల నాయకుడు పిల్లల అనిల్, బీజేవైఎం గ్రామ అధ్యక్షుడు సీహెచ్ రాజేందర్, యువకులు అజయ్, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రవీణ్, అనిల్, జోగేశ్వర్, హరీశ్, సునీల్, సాయి, రమేశ్, దమీం పాషా ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఆముదాలపల్లి అశోక్, కోరె రమేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మే రోజులు పోయాయి..
నడికూడ : కాంగ్రెస్ పార్టీని నమ్మే రోజులు పోయాయని ఎమ్మెల్యే చల్లా అన్నారు. బుధవారం రాత్రి మండలంలోని కంఠాత్మకూర్ గ్రామం యాదవ సంఘానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. పార్టీలో చేరిన వారిలో పరకాల మాజీ వైస్ ఎంపీపీ కొంగంటి తిరుపతి, సామాజి చంద్రమౌళి, కొంగంటి రవీందర్, సామాజి భాస్కర్, కొంగంటి రఘు, కొంగంటి పెద్ద సాంబయ్య, దొనికి రాజలింగం ఉన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎంపీటీసీ..
గీసుగొండ : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని శాయంపేట ఎంపీటీసీ కాయిత భిక్షపతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు చల్లా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రైతులు తెలంగాణలో తిరుగుతూ కాంగ్రెస్‌ను నమ్మొవద్దని ప్రచారం చేస్తున్నారని, అక్కడ 5 గంటల కరెంటును విడుతల వారీగా ఇస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు కాలం చెల్లిందన్నా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మం డలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, నాయకుడు రడం భరత్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, భిక్షపతి, ముంత రాజయ్య, లెనిన్‌గౌడ్, కోటా ప్రమోద్, చంటి, సర్పంచ్‌లు గాజర్ల గోపి, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
యువత చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్..
సంగెం : యువత చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉన్నదని చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని నార్లవాయి, చింతలపల్లి, కృష్ణానగర్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ పార్టీలకు రాజీనామాలు చేసి హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యురాలు మొలుగూరి కవితాయాకయ్య, సింగిరెడ్డి రాజు, మొలుగూరి మల్లయ్య, దామెర సుదర్శన్, మొలుగూరి మొగిలి, రాజు, వేల్పుల రవికుమార్, నాగరాజు, వినయ్, కార్తీక్, అశోక్, లక్ష్మణ్, వేల్పుల రాజు, బాషబోయిన మహేందర్, రిషిత్కుమార్, రవి, నరేశ్, రాజేశ్, కార్తీక్, సుదర్శన్, శివరాజు, నాగరాజు, శశికుమార్, మనోజ్, రాహుల్, రంజిత్, హేమంత్, రాకేశ్, లోకేశ్, శ్రీనివాస్, సుదర్శన్, నాగరాజు, వార్డు సభ్యుడు మేకల రవి, రాజ్‌కుమార్, రాజయ్య, రాజు, శ్రీనివాస్, ఐలయ్య, మొగిలి, దేవరాజ్, వేల్పుల స్వామి ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

