శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Dec 29, 2020 , 00:20:47

‘జయముఖి’ అధ్యాపకులకు అరుదైన అవార్డు

‘జయముఖి’ అధ్యాపకులకు అరుదైన అవార్డు

నర్సంపేట రూరల్‌, డిసెంబర్‌ 28 : మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్‌ అటానమస్‌ కళాశాలకు చెందిన అధ్యాపకులు ఇంటర్నేషనల్‌ యంగ్‌ సైంటిస్ట్‌, బెస్ట్‌ అకాడేమిషన్‌ అవార్డును అందుకున్నట్లు కళాశాల జాయింట్‌ సెక్రటరీ టీవీఆర్‌ఎన్‌ రెడ్డి, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీ రంగయ్య తెలిపారు. సోమవారం కళాశాలలో వారు మాట్లాడుతూ.. ఈఈఈ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్‌ కే రంజిత్‌ ఇంటర్నేషనల్‌ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు, మరో అధ్యాపకుడు ఈఈఈ విభాగం ప్రొఫెసర్‌ రజినీకుమార్‌కు బెస్ట్‌ అకాడేమిషన్‌ అవార్డు అందుకున్నారని తెలిపారు. అవార్డులు అందుకున్న ప్రొఫెసర్లను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లోక్‌నాథ్‌రావు, విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.