బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం

నర్సంపేట, డిసెంబర్ 7 : వీవో రోడ్డు పురుషుల పొదు పు, పరస్పర సహాయక సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి బీమా సొమ్మును అధ్యక్షుడు మేడిద రవి, కక్కెర్ల రమేశ్ సోమవారం అందించారు. ముప్పిడి రాజు (40) అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, బీమా విప త్తు సాయం రూ.50 వేలు, అభయనిధి రూ.10 వేలు, బోనస్ వాటాధనం కలిపి మొత్తం రూ.71073 నగదును నామినీకి అందించారు. కార్యక్రమంలో జగదీశ్, రామస్వామి, వాసుదేవచారి, శ్రీనివాస్, రాంచందర్, భిక్షపతి, గిరినాథ్, కృష్ణ, రమేశ్, సారంగపాణి పాల్గొన్నారు.
బియ్యం అందజేత..
నర్సంపేట రూరల్ : మండలంలోని రాజేశ్వరరావుపల్లిలో బాధిత కుటుంబానికి ఆదివారం రాత్రి పలువురు టీఆర్ఎస్ నాయకులు బియ్యం అందజేశారు. గ్రామానికి చెందిన కీసరి పెద్ద సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అందించిన క్వింటాల్ బియ్యాన్ని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్ బొజ్జ యువరాజ్, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ తాటికొండ సునీత, గ్రామ అధ్యక్షుడు బొజ్జ స్వామి బాధిత కుటుంబానికి అందించారు. గ్రామ కార్యదర్శి గౌరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు పిట్టల సుమన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : చెన్నారావుపేట గ్రామానికి చెందిన చింతకాయల కొమ్మాలు (65)అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి మృతదేహంపై టీఆర్ఎస్ మండల నాయకుడు కంది కృష్ణచైతన్య, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి, కుసుమ నరేందర్, వార్డు సభ్యులు బండి ఉపేందర్, ననుమాస సాయికుమార్, హంస భద్రయ్య, అడుప అశోక్, మంద ముక్తీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరు వాయిదా
- ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సమాలోచన!
- హల్దీ వేడుకల్లో వరుణ్ ధావన్ హల్చల్
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్
- విజయవంతంగా ఆకాశ్-NG క్షిపణి పరీక్ష
- ఢిల్లీలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా
- పెళ్లి విందులో వైరల్ అయిన వంటకం
- టూరిజంలో మళ్లీ కొలువుల కళ!
- ఆడపిల్లల చదువు సమాజానికి వెలుగు : మంత్రి