మొక్కజొన్న.. పోషకాలు మిన్న

భూపాలపల్లి టౌన్ : ఈ సీజన్లో దొరికే అత్యధిక పోషకాలు కలిగిన పదార్థాల్లో మొక్కజొన్న ఒకటి. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. చిటపట చినుకులు పడుతుంటే వేడి వేడి మొక్కజొన్నలను ఒక్కొక్క వరుస ఒలుచుకుని తింటుంటే ఆ మజానే వేరు. ఈ సీజన్ సెప్టెంబర్ చివరి వారం వరకు కంకులు దొరుకుతాయి. మొక్కజొన్నలో ఉండే మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం మన శరీ రంలోని అనేక జీవక్రియలు బాగా పనిచేయడానికి తోడ్పడుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఎముకలకు, కిడ్నీల కు ఫాస్పరస్ ఎంతో మేలు చేస్తుంది. నార్మల్ హార్ట్ రేట్‌కు మెగ్నీషియం సహాయపడుతుంది. మొక్కజొన్నను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కార్డియోవాస్క్యులర్ హెల్త్ (రక్తకణాల ఆరోగ్యానికి)కు చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోప్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతేకాదు రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. స్వీట్‌కార్న్‌లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. యాంటీ యాక్సిడెంట్స్ డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్లను నిరోధిస్తుంది. ఇది పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాల్సిన వాటిలో స్వీట్‌కార్న్ ఒకటి.
తాజావార్తలు
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్‌లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'