Fahadh Faasil | పుష్ప సినిమాపై ఫహద్ ఫాసిల్ షాకింగ్ కామెంట్స్..!
Fahadh Faasil | సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప ది రైజ్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఒక్కటి తగ్గింది.. అంటూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). త్వరలోనే పుష్ప ది రూల్‌లో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Fahadh Faasil | మాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ యాక్లర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప ది రైజ్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఒక్కటి తగ్గింది.. అంటూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే పుష్ప ది రూల్‌లో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్టార్ యాక్టర్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ఆవేశం. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు వసూళ్లు చేసింది.
కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పుష్ప సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప నా కోసం ఏదో చేసిందని అనుకోవడం లేదు. ఈ విషయాన్ని దాచవలసిన అవసరం లేదు. సుకుమార్ సర్కి ఇదే చెప్పాను. నేను నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు కావాల్సిన వాటిని ఇక్కడ (మాలీవుడ్)లో చేస్తున్నాను. నేను ఎవరినీ అగౌరవపరచడం లేదు. పుష్ప తర్వాత ప్రజలు నా నుండి మ్యాజిక్‌ను ఆశిస్తున్నారు.. లేదు. ఇది సుకుమార్ సర్ పట్ల ప్రేక్షకులు చూపించిన స్వచ్ఛమైన సహకారం, ప్రేమ. నాకు సంబంధించిన విషయాలన్నీ చాలా స్పష్టంగా మలయాళ సినిమాలో ఉన్నాయంటూ.. తన మాతృభాషపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రోమాంచం ఫేం జీతూ మాధవన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆవేశం విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఫహద్ ఫాసిల్ తమిళంలో మారీసన్, వెట్టయియాన్ చిత్రాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

