రాయపర్తి, ఫిబ్రవరి 9: అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి సారథ్యంలో గులాబీ గూటికి చేరుకుంటున్నారు.
ఆదివారం మండలంలోని జేతురాంతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జేతురాంతండా, రావుల తండా, విద్యానగర్ తండాలకు చెందిన సుమారు 200 మంది గిరిజనులు తమ కుటుంబాలతో సహా ర్యాలీగా తరలి వచ్చి బీఆర్ఎస్లో చేరగా, వారికి మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్తో కలిసి ఆయన గులాబీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, లేతాకుల రంగారెడ్డి, మధుకర్‌రెడ్డి, భూక్యా సురేందర్,రాథోడ్నాయక్, గారె నర్సయ్య, సంది దేవేందర్‌రెడ్డి, గజవెల్లి ప్రసాద్, అయిత రాంచందర్, చందు రామ్‌యాదవ్, తాళ్లపల్లి సంతోష్‌గౌడ్, కోల సంపత్, ఎల్లస్వామి, రవినాయక్, మహేశ్, శ్రీధర్ పాల్గొన్నారు.