నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 14 : ఉమ్మడి జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం 85.2 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలో 82,728 ఓటర్లకు 70,526 మంది (85. 25%), మహబూబాబాద్‌లో 1,98,785కు 1,69,071 (85.05), జనగామలో 1,07, 067కు 94776 (88.52), వరంగల్‌లో 1,36,191కు 1,20, 001 (88.11), హనుమకొండలో 1,25,735కు 1,09,822 (87.34), ములుగులో 54,944 మందికి 45,563(82.93) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా 57 సర్పంచ్, 917 వార్డులు ఏకగ్రీవం కాగా, 1 సర్పంచ్, 8 వార్డులకు నామినేషన్లు రాలే దు. మిగిలిన 506 సర్పంచ్, 4,003 వార్డులకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగగా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, వృద్ధులను జీపీ సిబ్బంది ట్రై సైకిళ్లపై పోలింగ్ బూత్‌ల్లోకి తీసుకెళ్లారు. నల్లబెల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దంపతులు, చిన్నగూడూరులో మాజీ ఎమ్మె ల్యే రెడ్యానాయక్, జనగామ మండలం ఎల్లం లో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పరకాల మండలం నాగారం గ్రామం లో కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం చూపి కౌంటింగ్ కేంద్రంలోకి చొచ్చుకుపోయే ప్రయ త్నం చేశాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో కలెక్టర్లు, సీపీ, పోలీస్ ఉన్నతాధికారులు, ఎన్నికల పరిశీలకులు, అధికారులు పోలింగ్ సరళిని పరిశీలించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి తొలుత వార్డు సభ్యుల స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఓట్ల ను లెక్కించి ఫలితాలు వెల్లడించారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించడంతో మేజర్ గ్రామపంచాయతీల్లో సర్పంచ్ ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యాయి. – సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయవం 506 సర్పంచ్ స్థానా ల్లో-బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.- మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు, ఇతరులు-మంది పాగా వేశారు.
సంగెం : సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ సర్పంచ్‌గా కొంగర మల్లమ్మ ఒక్క ఓటు తో గెలిపొందింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కొంగర మల్లమ్మ, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నవ్యశ్రీ పోటీపడ్డారు. గ్రామంలోని 1647 మంది ఓట్లకు 1451 పోలయ్యాయి. ఇందులో మల్లమ్మకు 705, నవ్యశ్రీకి 704 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 27 ఓట్లు చెల్లనవి కాగా, 6 ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే 9 ఓట్లు ఏ గుర్తుకు ఓటు వేయకుండానే బ్యాలె ట్ బాక్స్‌లో వేశారు. గ్రామంలో ఒకే కుటుంబం ఎస్సీ సామాజిక వర్గం ఉండగా, వారికే రిజర్వే షన్ వచ్చింది. కొంగర మల్లమ్మ ఒక్కరే ఉన్నారని ఏకగ్రీవం అవుతుందని భావించినా, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతితో వివాహం చేసుకోగా నవ్యశ్రీని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచింది.
తొర్రూరు : పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి స్వగ్రామం చర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయింది. ఝాన్సీరెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మారపు కిరణ్‌పై, కాంగ్రెస్ రెబల్ తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి బలపరిచిన మహేందర్ 80 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్వగ్రామంలోనే కాంగ్రెస్ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో పార్టీ వర్గాల్లో కలవరం నెలకొంది.
పెద్దవంగర : డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రూనాయక్ స్వగ్రామం రెడ్డికుంట తండా లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జాటోత్ య మున గెలిచింది. సమీప కాంగ్రెస్ అభ్యర్థి బానో త్ శాంతిపై విజయం సాధించింది. ఈ గ్రామం లో మొత్తం 6 వార్డుల్లో 397 ఓటర్లు ఉండగా, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి 74 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.
ఐనవోలు : టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు(కాంగ్రెస్ నాయకుడు) ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. ఐనవోలు సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గడ్డం రఘువంశీ 482ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రఘువంశీకి 2038 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బొల్లెపల్లి మధుకు 1556 ఓట్లు వచ్చాయి.
