ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మహిళలపై హింస ఆగడం లేదు.. భాగ్యనగరంలో ఏదో ఒక చోట బాలికలు, యువతులు, మహిళలపై ఏదో రకమైన దాడులు జరుగుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. రాజధానిలోని పోలీస్ కమిషనరేట్లలో అతివలపై నేరాల సంఖ్య ఏటా పెరుగుతున్నది. 2024తో పోలిస్తే 2025లో హైదరాబాద్ 6 శాతం, రాచకొండలో అంటే ప్రస్తుతం మల్కాజిగిరిలో 4 శాతం, సైబరాబాద్‌లో 1 శాతం చొప్పున పెరిగాయి. షీటీమ్స్‌కు చిక్కుతూ కౌన్సిలింగ్ పొందుతున్న వారు వేల సంఖ్యలో ఉంటున్నారు. కట్నం కోసం హత్యల్లో 6 కేసులతో రాచకొండ టాప్‌లో ఉండగా, వేధింపులు , గృహహింసలో హైదరాబాద్ కమిషనరేట్‌లో గతేడాది 1,069 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్ కేసుల్లోనూ రాచకొండలో 2024తో పోలిస్తే 2025లో 479 కేసులు నమోదు కావడం గమనార్హం.
-సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మార్చ్7(నమస్తే తెలంగాణ): ఆఫీసులో తోటి మహిళా ఉద్యోగి చిత్రాన్ని నగ్నంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేవారొకరు.. బస్సు టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్లే ఫోన్ నెంబర్ సేకరించి అసభ్య సందేశాలు పంపించే ఉద్యోగి, ఇలా స్నేహం పేరుతో దగ్గరై కొందరు వ్యక్తులు కుటిల బుద్ది చూపిస్తున్నారు. 2024తో పోలిస్తే 2025లో హైదరాబాద్ 6 శాతం, రాచకొండలో అంటే ప్రస్తుతం మల్కాజిగిరిలో 4 శాతం, సైబరాబాద్‌లో 1 శాతం చొప్పున పెరిగాయి.
షీటీమ్స్‌కు చిక్కుతూ కౌన్సిలింగ్ పొందుతున్న వారు వేల సంఖ్యలో ఉంటున్నారు. కట్నం కోసం హత్యల్లో 6 కేసులతో రాచకొండ టాప్‌లో ఉండగా, వేధింపులు , గృహ హింసలో హైదరాబాద్ కమిషనరేట్‌లో గత సంవత్సరం 1069 కేసులు నమోదు కాగా కిడ్నాప్ కేసుల్లోనూ రాచకొండలో 2024తో పోలిస్తే 2025లో 479 కేసులు నమోదై గతం కంటే ఎక్కువగా ఉన్నట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.
అతివలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నా .. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం భాగ్యనగరంలో ఎక్కడో ఒకచోట బాలికలు, యువతులు, మహిళలపై ఏదో రకమైన దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహిళలపై జరిగే దారుణాల్లో 95శాతానికి పైగా నిందితులు బాధితులకు తెలిసినవారే కావడం గమనార్హం. లైంగిక వేధింపులు, దాడులు, పోక్సో సహా ఇతర కేసుల్లో ఎక్కువ మంది పరిచయం ఉన్నవారే కాగా స్నేహం , సహాయం, ప్రేమ పేరుతో దగ్గరై అసలు రూపం చూపిస్తున్నారు.
బాధితురాలు వేధింపులు భరించలేక ఎదురు తిరిగితే అంతమొందిస్తున్నారు. కొందరు లైంగిక వాంఛ తీర్చకోవడానికి ప్రేమ పేరుతో దగ్గరవుతున్నారు.ఇటీవల నగరంలోని ఒక ప్రాంతం నుంచి షీటీమ్స్‌కు వచ్చిన ఫిర్యాదే ఇందుకు నిదర్శనం. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు ఇంటికి పొరుగున ఉండే వ్యక్తి సహాయం చేస్తూ దగ్గరయ్యాడు. ఫోన్‌నెంబర్ సేకరించి వేధింపులు మొదలుపెట్టారు. షీటీమ్స్ ఎంటరవడంతో తోకముడిచాడు. పరువు పోతుందని బాధపడిన ఆ మహిళ ఎలాంటి కేసు పెట్టవద్దని, దీనివల్ల తనకు నష్టం జరుగుతుందని చెప్పడంతో పోలీసులు ఆమె వినతిని మన్నించి అతనిని తీవ్రంగా మందలించి వదిలేశారు. మహిళలపై వేధింపులు ఎక్కువవడానికి బాధితుల మౌనం కూడా ఒక కారణమవుతోంది. సమస్య మొదలైనప్పుడే దాన్ని బయటపెట్టకుండా లోలోపలే కుమిలిపోతుంటారు.
ఒకవైపు షీటీమ్స్ పండుగలు, పర్వదినాలు, ఉత్సవాల్లో తమ నిఘా కొనసాగిస్తున్నా.. నగరంలో మహిళలను వేధించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత సంవత్సరం జరిగిన బోనాల్లో 644మంది ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేస్తే అందులో మైనర్ల కంటే నడివయసు వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక ఇటీవల జరిగిన నుమాయిష్‌లో 264 మంది పోకిరీలను షీటీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. ట్యాంక్‌బండ్ పరిసరప్రాంతాలతో పాటు మెట్రో స్టేషన్లు, ఇతర పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీరి ఆగడాలు చెప్పనలవికాకుండా ఉన్నాయని మహిళలు అంటున్నారు. షీటీమ్స్ ఎంత నిఘా పెట్టినా కొన్నిచోట్ల ఈ ఆకతాయిల కారణంగా బయటకు రావాలంటేనే భయం వేస్తున్నదని యువతులు చెప్పారు.