ఖిలావరంగల్: ఖిలావరంగల్ (Warangal) మధ్య కోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 25 వసంతాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1997-98 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో సందడి చేశారు. పాఠశాల అభివృద్ధి కొరకు ముందుంటామని హామీ ఇచ్చారు.
10 కుర్చీలు, రెండు పెద్ద టేబుల్ ఫ్యాన్స్, రెండు వాటర్ క్యాన్లు ఇన్చార్జి ఉపాధ్యాయుడు వెంకటరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఐలయ్య, భగవంతయ్య, లక్ష్మయ్య , కొమురయ్య, కృష్ణమోహన్, అటెండర్ దస్తగిరి, పూర్వ విద్యార్థులు అశోక్, పూర్ణచందర్, చిరంజీవి, రమేష్, రజిత , భాస్కర్ , శ్రీలత, మహేందర్,రవి తదితరులు పాల్గొన్నారు.