దేశ భాషలందు తెలుగు లెస్స
బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి
విద్యార్థుల్లో అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు
నర్సంపేట, ఫిబ్రవరి 21 : దేశభాషలందు తెలుగు లెస్సా అని బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని అక్షరస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ భాషల్లోనే తెలుగుభాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. మాతృభాషను ప్రేమిస్తూ ఇతర భాషలను గౌరవించి అభివృద్ధి పథంలో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల సెక్రటరీ రాజేశ్వర్‌రెడ్డి, సీఈవో సురేశ్, పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : ఏఎంవో
ఖానాపురం: చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో విద్యా ప్రమా ణాలను పెంపొందించేందుకు రీడ్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి సారయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమ వారం అశోక్‌నగర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 100 రోజుల రీడ్ ప్రోగ్రాంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదవడం వలన విద్యార్థుల్లో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
మాతృభాషపై పట్టు పెంచుకోవాలి..
మాతృభాషపై ప్రతి విద్యార్థి పట్టు పెంచుకోవాలని జిల్లా సెక్టోరియల్ అధికారి సారయ్య సూచించారు. అశోక్‌నగర్ కేజీబీవీలో మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యా లు అలరించాయి. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ వో మేనక, సీఆర్టీలు విజయ, లావణ్య, సోమలక్ష్మి, సరిత, సీఆర్పీ రమేశ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట: మాతృభాష దినత్సోవాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాలలో ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన పలువురు విద్యార్థులకు తెలుగు పెద్ద బాలశిక్ష, వివేకానందుడికి సంబంధించిన పలు గ్రంథాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి యువత తెలుగు భాష ప్రాముఖ్యతను తెలుసుకొని భాషా పరిరక్షణ కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అద్యాపకులు శ్రీనివాస్, మాలతీలత, శ్రీధర్‌రెడ్డి, ఎన్ శ్రీనివాసరావు, కే సంధ్య, సుధారాణి, శ్వేత, ఎన్ శ్రీనివాస్, జ్యోత్స్న పాల్గొన్నారు.
కేజీబీవీ పాఠశాలలో ..
చెన్నారావుపేట: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో స్పెషలాఫీసర్ ఎం జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మాతృభాషాదాదినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాసపోటీలు, కవితలు, నాటికలు, నృత్యప్రదర్శన పోటీలు నిర్వహించి. విజేతలకు బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయునులు తేజస్విని, షాహీనా, మంజుల, సంధ్య, సబి త, రాజ్యలక్ష్మి, సరస్వతి, స్వరూప, దేవిక, అనిత, నాగరాణి, సుజాత, మౌనిక, కే. మౌనిక, రజిత, స్వప్న పాల్గొన్నారు.
మాతృభాష కన్నతల్లిలాంటిది : క్లస్టర్ హెచ్ఎం
ఖానాపురం: మాతృభాష కన్న తల్లిలాంటిదని ప్రతి ఒక్క రూ దానిని కాపాడుకోవాలని ఖానాపురం క్లస్టర్ హెచ్ఎం దూళం రాజేందర్ సూచించారు. సోమవారం ఖానాపు రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాఖమూరి చిరంజీవి, ఎంపీటీసీ మర్రి కవిత, అన్వర్‌పాషా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
భాష సమాజంలోనే అత్యంత విలువైనది
నర్సంపేట: భాష సమాజంలోనే అత్యంత విలువైనదని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చం ద్రమౌళి అన్నారు. సోమవారం నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, డాక్టర్ సుమన్, త్యాగయ్య,విష్ణు, పూర్ణచందర్ పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ: మండలంలో మాతృభాషా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు గీసుగొండ, ధర్మారం, మచ్చాపురం, కొమ్మాల ప్ర భుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించారు. మచ్చాపురం ప్రభుత్వ పాఠశాలలో చదవుతున్న విద్యార్థులకు ఉచింతగా పాఠ్యపుస్తకాలను సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దూరవిద్యాకోఆర్డినేటర్ శ్రీకాంత్, కుమారస్వామి, శ్రీనివాస్, మధుసూదనాచారి, మంజుల పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్‌లో..
పోచమ్మమైదాన్: అంతర్జాతీయ మాతృబాష దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎల్బీ నగర్‌లోని ప్రభుత్వచార్బౌళి ఉన్నత పాఠశాలలో సోమవారం పలు కార్యక్రమా లు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ కవిత ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.