Warangal ITI | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 6: ఈనెల 8న ములుగు రోడ్లోని వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మంగనూరి చందర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని, ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, టర్నర్, మేకానిస్ట్, వెల్డర్, ఎలక్టానిక్ మెకానిక్, డీజిల్, మోటార్ మెకానిక్, కోపా ట్రేడ్లకు అప్రెంటీషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు, ఎన్నికైన విద్యార్థులకు నెలకు స్టెఫండ్ రూ.12 నుంచి రూ.15 వేల వరకు ఇస్తారన్నారు. ఆసక్తిగలవారు 8న(సోమవారం) వరంగల్ ఐటీఐ క్యాంపస్లో అర్హత పత్రాలను(ఐటీఐ పాస్ సర్టిఫికేట్) తీసుకొని హాజరుకావాలని కోరారు.