రామారెడ్డి, సెప్టెంబర్ 6: కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం మిగతా పనులన్నీ వదులుకొని సొసైటీ గోదాముల వద్దే పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు బా రులు తీరుతున్నారు. జిల్లాలో యూరి యా కొరత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం తనకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. దీంతో రైతులకు కష్టాలు తప్పడంలేదు.
రామారెడ్డి మండల కేంద్రంలో యూరి యా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కొరత ఉండడంతో మూడు రోజుల క్రితంఅధికారులు దాదాపు 880 మంది రైతులకు టోకెన్లు జారీ చేశారు. శనివారం పోలీసు పహారా మధ్య ఒక్కో రైతుకు ఒక్కబస్తా యూరియా మాత్రమే పంపిణీ చేశారు.
యూరియా స్టాక్ అయిపోవడంతో ఉదయం నుంచి క్యూలో నిల్చున్న రైతులు నిరాశతో వెనుదిరిగారు. త్వరలో యూరియా వస్తుందని, మిగతా వారికి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. యూరియా పంపిణీ కేంద్రాన్ని ఏడీఏ సుధామా ధురి సందర్శించారు. యూరియా అందని రైతుల నుంచి పట్టాపాస్ పుస్త కాల జిరాక్స్ కాపీలను తీసుకొని, యూరియా వచ్చాక ముందుగా వారికి మాత్రమే పంపిణీ చేయాలని మండల వ్యవసాయ అధికారి భానుశ్రీని ఆదేశించారు.