క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలి : నిట్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్
రాష్ర్ట, జాతీయస్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని నిట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ అన్నారు.
అట్టహాసంగా సివిల్ సర్వీసెస్ సెలక్షన్స్
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 6 : రాష్ర్ట, జాతీయస్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని నిట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సివిల్ సర్వీసెస్ సెలక్షన్స్‌కు రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించే జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా సెలక్షన్స్ మంచి స్పందన రావడం సంతోషకరమన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగం చేస్తూ క్రీడలపై మక్కువతో పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. అనంతరం సెలక్షన్స్‌కు హాజరైన ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం జిల్లా యువజన క్రీడా అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ రవికుమార్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉన్నతస్థాయిలో చేరుకుని పలువురి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా డీఎస్ఏ ఆఫీసులో ఆవరణలో రవికుమార్ మొక్కలు నాటారు. అనంతరం రవికుమార్‌ను ఘనంగా సన్మానించారు. డీఎస్ఏ కోచ్‌లు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

