శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 21, 2021 , 00:57:19

పరువు రోడ్డున..!

పరువు రోడ్డున..!

  • కటకటాల్లోకి నెడుతున్న మద్యం మత్తు
  • తప్పని తెలిసినా వినని మందుబాబులు
  • పోలీసుల వలలో సగటున రోజుకు ఇద్దరు  
  • కమిషనరేట్‌ పరిధిలో ఈ నెలలోనే 45మంది జైలుకు..
  • తల్లిదండ్రులు, భార్యకు తప్పని అవమానభారం
  • యువత పైనే ఎక్కువగా కేసులు

తాగి బండి నడుపొద్దని తెలుసు. అయినా వినరు. ప్రమాదం జరిగితే ఒక్కోసారి ప్రాణాలు పోతాయని తెలిసినా కొందరు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. యువకులు, పెద్దవాళ్లే కాదు.. తామేం తక్కువన్నట్లు ఉద్యోగులూ ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌'లో పోలీసులకు పట్టుబడుతున్నారు. ఫ్రెండ్స్‌తో పార్టీ అనో.. పెండ్లి దావత్‌ అనో, వీకెండ్‌ ఎంజాయ్‌ పేరుతోనో తెగతాగి బైకులెక్కే వారు ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. చేసిన ఘనకార్యానికి తల్లిదండ్రులు, భార్యను కౌన్సెలింగ్‌ కోసం ఠాణాల చుట్టూ తిప్పించి ఇంటి పరువు రోడ్డున పడేస్తున్నారు. సగటున రోజుకు ఇద్దరు చొప్పున మందుబాబులు పట్టుబడుతుండగా ఈ ఏడాది మొదటి నెలలోనే వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 45మంది డ్రంక్‌ అండ్‌డ్రైవ్‌ కేసులో జైలుకెళ్లి నలుగురిలో తలదించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు.

హన్మకొండ సిటీ, జనవరి 20: ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌'తో మందుబాబులు తమ ఇంటి పరువును బజారుకీడుస్తున్నారు. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి తల్లిదండ్రులకు, భార్యను తలవంపులు తెస్తు న్నారు. తాగి బండి నడుపొద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా రోడ్లెక్కి ప్రమాదాలకు కారణమవుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట తనిఖీల్లో పట్టుబడుతున్నా వారిలో మార్పు రావడం లేదు. వీరిలో ఎక్కువగా యువకులు ఉంటుండగా గమనార్హం. మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే కుటుంబసభ్యులు సైతం పోలీసులు ముందు హా జరు కావాల్సి ఉంటుంది. తాము చేసి న తప్పునకు వారిని కోర్టు, కౌన్సెలింగ్‌ సెంటర్ల చుట్టూ తిప్పుతూ నానా అవస్థలకు గురిచేస్తున్నారు. కౌన్సెలింగ్‌కు వెళ్లకుండా వారిని తప్పించేందుకు నానా తంటాలు పడు తున్నా అధికారులు మాత్రం వదిలిపెట్టడం లేదు.

రోజుకు ఇద్దరి చొప్పున జైలుకు..

జనవరి 1 నుంచి ఇప్పటివరకు కమిషనరేట్‌ పరిధిలో 45 మంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేసి జైలుకు వెళ్లారు. వరంగ ల్‌ ట్రాఫిక్‌ స్టేషన్‌ పరిధిలో 33, హన్మకొండలో 11, కాజీపేటలో 1 నమోదయ్యాయి. ఇవి గాక 341మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది 27 మంది జైలుకు వెళ్లగా వారిలో 25 సంవత్సరాల్లోపు యువకులే కావడం ఆందోళన కలిగిస్తోంది. అందులో 18మంది వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమో దైనవే. వీరంతా ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసేవారే గాక ఉన్నత చదువులు చదువుతున్న వారు ఉండడం వారి తల్లిదండ్రు లను కలవర పెడుతోంది.

శ్రీకాంత్‌.. (పేరు మార్చాం).. 

హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఒక్కరోజు సెలవు తీసుకొని ఏదో పనిపై నగరం లోని తన చుట్టాల ఇంటికి వచ్చాడు. బంధువులతో కలిసి సాయంత్రం పార్టీ చేసుకున్నాడు. మద్యంతాగి బైక్‌పై రోడ్డె క్కి పోలీసులకు చిక్కాడు. తాగి నడిపాడన్న కారణంతో బండిని సీజ్‌ చేసి, అతడి పై కేసు రాశారు. తెల్లవారితే ఉద్యో గానికి వెళ్లాల్సిన అతడు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని ఎవరికీ అందు బాటులోకి రాలేదు. కేసు భయం, కౌన్సె లింగ్‌కు కుటుంబసభ్యులతో రావాలని, కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుందని మానసికంగా కుంగిపోయాడు. మద్యం మత్తులో చేసిన తప్పుకు జైలు శిక్ష దాకా వెళ్లి చివ రికి ఫైన్‌తో బయటపడ్డాడు. కానీ, ఓ వారం పదిరోజుల పాటు మామూలు మనిషి కాలేదు.. ఇలా ఒక్క శ్రీకాంతే కాదు.. చాలా మంది తెలిసి కూడా తప్పులు చేస్తూ కటక టాల పాలై కుటుంబం ముందు తలవంచుకుంటున్నారు.

VIDEOS

logo