సోమవారం 01 జూన్ 2020
Warangal-city - May 21, 2020 , 02:36:55

ప్రతిపక్షాలవి..మత రాజకీయాలు

ప్రతిపక్షాలవి..మత రాజకీయాలు

తొర్రూరు/పెద్దవంగర : కొందరు వ్యక్తులు చేసిన తప్పును మొత్తం వర్గానికి ఆపాదించడం తగదని, ముస్లింలపై వివక్ష చూపడం సరికాదని పంచాయ తీరాజ్‌, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామాల్లో ఉత్సవ్‌ కల్చరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్‌ను పురస్కరించుకొని బుధవారం సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తొర్రూరు హైస్కూల్‌, పెద్దవంగర టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా 3వేల ముస్లిం కుటుంబాలకు సామగ్రి అందజేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ముస్లింల వల్లే కరోనా వ్యాప్తి చెందిందని మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను నామినేషన్‌ వేసే ముందు తప్పనిసరిగా మసీదు, దేవాలయం, చర్చికి వెళ్తానని చెప్పారు. 

ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు చేద్దాం..

ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, శాస్త్రవేత్తల ఆలోచన మేరకు ప్రాంతాల వారీగా చెప్పిన పంటలను సాగు చేసి రాష్ర్టాన్ని వ్యవసాయ రంగంలో అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో రైతులకు, వారు పండించిన పంటలకు దిక్కులేదని, మద్దతు ధర వచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత పాలకుల హయాంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవని, కానీ ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో పండించిన పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉందని, తెలంగాణ సోనా.. షుగర్‌లెస్‌ వెరైటీగా పిలిచే ఈ రకం మనవద్దే పండుతున్నదన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన కరోనా అంతం కాదని, కరోనాతో సహజీవనం చేస్తూ ముందుకు సాగాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, ఎంపీపీలు అంజయ్య, రాజేశ్వరి, జెడ్పీటీసీలు శ్రీనివాస్‌, జ్యోతిర్మయి, మున్సిపల్‌ కమిషనర్‌ బాబు, సీఐ చేరాలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ హరిప్రసాద్‌, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్‌ కిశోర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు అంకూస్‌, తహసీల్దార్లు రమేశ్‌బాబు, యోగేశ్వర్‌రావు, సొసైటీ అధ్యక్షుడు సోమేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సీతారాములు, ఎంపీడీవో అపర్ణ, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, టీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి సోమేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఐలయ్య, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ముజీబుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

అన్ని మతాలకు సమప్రాధాన్యం..

దేవరుప్పుల/కొడకండ్ల : తెలంగాణలో అన్నిమతాలకు సర్కారు సమప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు ఎర్రబెల్లి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల, కొడకండ్లలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో లాక్‌డౌన్‌ విధించిన సందర్భంగా పేదలు, వలస కూలీలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ 12 కిలోలు ఉచితంగా రేషన్‌ బియ్యంతో పాటు తెల్ల రేషన్‌కార్డుదారులకు రూ.1500 చొప్పున నగదును పంపిణీ చేశారని గుర్తు చేశారు. రంజాన్‌ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని పేద ము స్లింలను ఆదుకునేందుకు ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా సుమారు రూ.20 లక్షల వ్య యంతో నిత్యావసరాలు అందిస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల్లో లబ్ధిదారులకు ఎర్రబెల్లి చెక్కులు అందజేశారు. దేవరుప్పులలో జరిగిన సమావేశంలో ఎంపీపీ సావిత్రి, తహసీల్దార్‌ ఫరీదుద్దీన్‌, ఎంపీడీవో అనిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, నాయకులు సుందరరాంరెడ్డి, మల్లేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు రమాదేవి, అంజమ్మ, ఎంపీటీసీ మేడ కల్యాణి పాల్గొన్నారు. కొడకండ్లలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ దరావత్‌ జ్యోతి రవీంద్రగాంధీనాయక్‌, జెడ్పీటీసీ కేలోత్‌ సత్తమ్మ, ఆర్డీవో రమేశ్‌, తహసీల్దార్‌ జడల రమేశ్‌, ఎంపీడీవో డాక్టర్‌ రమేశ్‌, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి  

రాయపర్తి : మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగుల సంఘం మండలాధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ మాజీ మండలాధ్యక్షుడు, హిందీ పండిట్‌ గులాం జలీల్‌ బుధవారం  అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి రాయపర్తికి చేరుకుని జలీల్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బిల్ల సుధీర్‌రెడ్డి, సర్పంచ్‌ గారె నర్సయ్య, మహ్మద్‌ అష్రఫ్‌పాషా, వనజారాణి, ఎండీ ఉస్మాన్‌, కోటేశ్వర్‌, సత్యం, సుభాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వేణు, చందు రాంయాదవ్‌, సతీశ్‌యాదవ్‌, మన్నన్‌ తదితరులు ఉన్నారు.  


logo